ETV Bharat / state

Telangana Agriculture Progress : దండగ నుంచి పండుగ.. రెండు కోట్ల ఎకరాల మాగాణిగా తెలంగాణ

author img

By

Published : Jun 3, 2023, 7:23 AM IST

Formers Day in Decade Celebrations Telangana
అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ

Telangana Agriculture Progress Report 2023 : దండుగ అన్న వ్యవసాయం ఇప్పుడు తెలంగాణలో పండగైంది. ఏడేళ్లల్లో కోటి ఎకరాలకు పెరిగిన సాగుతో లక్ష కోట్లకి సాగు సంపద పెరిగింది. మద్దతు ధర నుంచి కొనుగోళ్ల దాకా.. రైతులకు ప్రతి అడుగులో రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని.. స్వరాష్ట్రంలో సగర్వంగా రైతులు.. పదేండ్ల పొద్దులో పచ్చని పరిమళాలు.. అంటూ ప్రభుత్వం ప్రగతి నివేదికను విడుదల చేసింది.

అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ

Telangana Agriculture Development Report 2023 : రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి సర్కారు అహర్నిశలు కృషిచేస్తోంది. బీడుబారిన వ్యవసాయ భూమికి ప్రభుత్వం కల్పించిన సాగు నీటి వసతితో సస్యశ్యామలంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని.. వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది.

Telanagna Decade Celebrations 2023 : రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి కోటి ఎకరాలకు పైగా సాగు నీరు ఇచ్చినట్లు వివరించింది. సాగు విస్తీర్ణణాన్ని 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచినట్లు తెలిపింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది.

నేరుగా రైతుల ఖాతాల్లో : దేశంలో వినూత్న ఒరవడితో రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతుకు పంట పెట్టుబడి సాయం అందించినట్లు వివరించింది. ఏడాదికి 65 లక్షల మంది రైతులకు 10 వేలు పంటపెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు గుర్తుచేసింది. 2018 వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు 10 సీజన్లలో.. ఏకంగా 65,192 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అంత భారీ మొత్తం రైతుల ఖాతాల్లో జమచేసిన ఏకైకప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమేనని పేర్కొంది.

రైతు వేదికలు : రైతులు ఆత్మగౌరవం చాటేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలు నిర్మించింది. ఆ రైతు వేదికలు వ్యవసాయ ప్రగతి దీపికలై రైతులకు మార్గదర్శనం చేస్తున్నాయని పేర్కొంది. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు మరో 20 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరించేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టమని తెలిపింది.

కోటిన్నర లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న స్వప్నం : ఒకనాడు చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతోందని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగు నీటివసతి ఏర్పడగా.. వచ్చే రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు ఇవ్వనుందని తెలిపింది. 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న స్వప్నం త్వరలో సాకారంకానుందని వివరిచింది. 2 కోట్ల పద్దెనిమిది లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తితో.. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. గత తొమ్మిది సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తి తొమ్మిది రెట్లు పెరిగింది.

పత్తి ఉత్పత్తిలో నెంబర్ 1 : పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే తొలిస్థానానికి చేరినట్లు ప్రగతి నివేదికలో సర్కార్‌ వివరించింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతులకు అందించడంతోపాటు దేశంలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో విత్తనాల ధ్రువీకరణ చేయడం సహా కల్తీవ్యాపారులపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. గోదాంల సామర్థ్యం 9.9 లక్షల టన్నుల నుంచి 31.9 లక్షల టన్నులకు పెంచనున్నట్లు వివరించింది.

తెలంగాణ భూములకు పామాయిల్‌ ఎంతో అనువైనవిగా కేంద్రం గుర్తించింది. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 32 వేల ఎకరాల్లో పంట సాగయ్యేది. నేడు 1 లక్షా 5 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ పంట విస్తీర్ణం 20 లక్షల ఎకరాలకు పెంచాలని కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.