ETV Bharat / state

షెకావత్​ జీ కాళేశ్వరంపై మాటలు సరే, చర్యలు ఏంటో తెలపాలంటూ రేవంత్ ట్వీట్

author img

By

Published : Aug 18, 2022, 3:24 PM IST

రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి

Revanth Reddy Tweet On Kaleshwaram కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ జీ కాళేశ్వరం అవినీతిపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పి చూశామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. అయినా తమ మాటలు పట్టించుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరంపై మాటలు సరే ముందు ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలంటూ షెకావత్​ను ట్విటర్ వేదికగా రేవంత్ ప్రశించారు.

Revanth Reddy Tweet On Kaleshwaram: కేంద్ర జల్​ శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ జీ .. కాళేశ్వరం అవినీతిపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పి చూశామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తే పెడచెవిన పెట్టారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారని పేర్కొన్నారు. మాటలు సరే ముందు చర్యల సంగతి ఏంటో చెప్పాలని షెకావత్​ను రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

అసలేెం జరిగిదంటే: గత కొద్ది రోజులుగా గోదావరికి వచ్చిన భారీ వరదతో మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 కీలక పంపుహౌస్​ల పునరుద్ధరణ యత్నాలు కొనసాగుతున్నాయి. అన్నారం పంపుహౌస్​ను పూర్వస్థితికి తీసుకొచ్చే పనులు 10 రోజులుగా జోరుగా జరుగుతున్నాయి. పంప్​హౌస్​లోకి వచ్చిన వరద నీటిని భారీ సామర్థ్యం కలిగిన మోటార్లతో బయటకు తోడేశారు. పంపులు, మోటార్లు శుభ్రం చేసే పని సాగుతోందన్న అధికారులు.. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆ తర్వాత పంపులను విడదీసి.. వాటిని పరిశీలించి ఆరబెట్టాక ఎంతమేర నష్టం జరిగిందనేది స్పష్టత వస్తుందని అంటున్నారు.

కీలకమైన కంట్రోల్ ప్యానెల్​ గదిలో పరికరాలు శుభ్రం చేసే ప్రక్రియ సాగుతోంది. అది పూర్తయ్యాక ఏ మేరకు నష్టం జరిగిందనేది ఒక అంచనా వస్తుందని అధికారులు వివరించారు. కంట్రోల్ ప్యానెల్ రూంలోకి వరద నీరు చేరినందున కొన్ని పరికరాలు దెబ్బతిని పనికిరాకపోవచ్చని.. ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ఇప్పటికే విదేశీ సంస్థలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. పంపులు, మోటార్లకు సంబంధించి పెద్దగా నష్టం జరగలేదని భావిస్తున్న ఇంజినీర్లు.. పంపులు, మోటార్లకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది వారం, పది రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అనంతరం అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

మరో వారంలో పూర్తి..: మేడిగడ్డ పంపుహౌస్​లో నీటిని తోడే పనులు సాగుతున్నాయి. ఆ పని పూర్తయ్యేందుకు మరో వారం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం పంపులు, మోటార్లు, కంట్రోల్ ప్యానెళ్లు సహా.. అన్నింటిని శుభ్రపరుస్తారు. రెండు పంపుహౌస్​ల పునరుద్ధరణకు సంబంధించి.. ఇంజినీర్లకు ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. పెంటారెడ్డి రెండు రోజుల క్రితం.. కన్నేపల్లి పంపుహౌస్​ను పరిశీలించి ఇంజినీర్లకు సూచనలు చేశారు. కేంద్ర జలసంఘం బృందం రెండు పంపుహౌస్​లను సందర్శించి.. ముంపునకు గల కారణాలను పరిశీలించింది.

  • షెకావత్ జీ…
    మీ తీరు చూస్తుంటే అరిచే కుక్క కరవదు అన్న సామెత గుర్తొస్తోంది.
    కాళేశ్వరం అవినీతి పై చర్యలకు కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తే మీరు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారు.

    మాటలు సరే… చర్యల సంగతి చెప్పండి సార్! pic.twitter.com/bsoeJOlXm8

    — Revanth Reddy (@revanth_anumula) August 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: కాంగ్రెస్‌లో మరో అసమ్మతి స్వరం, పీసీసీ తీరుపై మర్రి శశిధర్‌రెడ్డి అసహనం

బిల్కిస్​ బానో ఘటనలో దోషుల విడుదలపై బాధితురాలు అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.