ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-వాహనాల కొనుగోళ్లు.. ఎందుకంటే?

author img

By

Published : Feb 1, 2021, 4:26 PM IST

e vehicle
రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-వాహనాల కొనుగోళ్లు.. ఎందుకంటే?

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఎలక్ట్రికల్‌ వాహనాలు కొనుగోలు చేసే వారికి పలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. దీంతో ఈ-వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో విద్యుత్ వాహనాలకు రాయితీలు ప్రకటిస్తే... భవిష్యత్తులో మరిన్ని వాహనాలు రోడ్డెక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-వాహనాల కొనుగోళ్లు

రాష్ట్రంలో విద్యుత్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ-వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. విద్యుత్ వాహనాలకు అనువుగా ఉండేందుకు ప్రభుత్వం విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 30 విద్యుత్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతో ఈ-వాహనాలు మరింత పెరుగుతాయని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలకు పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించింది.

కొనుగోలు చేస్తే.. ప్రోత్సాహకాలు

రాష్ట్రంలో విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రోత్సాహం కింద 100శాతం రహదారి పన్నును మినహాయించింది. అందులో భాగంగా ద్విచక్రవాహనాలు, ఆటోలు, ప్రయాణికులను చేరవేసే కార్లు, సరుకు రవాణా చేసే ఆటోలు, బస్సులు వంటి వాటికి ఈ ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న 2లక్షల ద్విచక్ర వాహనాలు, 30వేల ఆటోలు, 10వేల కార్లు, 500ల బస్సులకు ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయని... పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్ జానయ్య తెలిపారు. ఇప్పటికే మహీంద్ర, టాటా సంస్థలు విద్యుత్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయన్నారు.

బడ్జెట్‌లో కేంద్రం మరిన్ని రాయితీలు ప్రకటిస్తే.... విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంవత్సరం బ్యాటరీ వాహనాలు డీజిల్​తో విద్యుత్ వాహనాలు పెట్రోల్​తో విద్యుత్ వాహనాలు
2016-17 25 0 0
2017-18217 2,905 0
2018-191,477 1,560 943
2019-201,456 38 834
2020-211,360 38 1
మొత్తం 4,535 4,541 1,778
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.