ETV Bharat / state

పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి: అనిల్​ కుమార్​

author img

By

Published : Dec 18, 2019, 10:12 PM IST

క్యాబ్​కు వ్యతిరేకంగా కాంగ్రెస్​ యువజన నాయకులు ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను మానుకోవాలని రాష్ట్ర యవజన కాంగ్రెస్​ అధ్యక్షుడు అనిల్​ కుమార్​ యాదవ్​ డిమాండ్​ చేశారు. అనంతరం కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.

పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి: అనిల్​ కుమార్​
పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి: అనిల్​ కుమార్​

పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి: అనిల్​ కుమార్​
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్​ నాయకులు హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో ఆందోళన చేపట్టారు.

దేశ సమైక్యత సమగ్రతకు పాటుపడే యువజన కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అనిల్​ కుమార్​ తెలిపారు. కేంద్రం వారసత్వ బిల్లును బలవంతంగా ప్రజలపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నట్లు వివరించారు. అనంతరం కాగడాలతో ర్యాలీ నిర్వహించారు.

అయితే నాయకులు ఇందిరాపార్కు నుంచి అంబేడ్కర్​ విగ్రహం వరకు వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు నిరాకరించారు. కొద్దిసేపు కాంగ్రెస్​ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇవీ చూడండి: 'పౌర' చట్టం రాజ్యాంగబద్ధత పరిశీలనకు సుప్రీం ఓకే

Intro:స్క్రిప్టు పంపాను


Body:స్క్రిప్టు పంపాను


Conclusion:స్క్రిప్టు పంపాను
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.