ETV Bharat / state

sports minister: అందులో సగం మన వారే ఉండాలి: శ్రీనివాస్​ గౌడ్​

author img

By

Published : Jul 21, 2021, 5:26 PM IST

Updated : Jul 21, 2021, 8:00 PM IST

gagan narang, srinivas goud
శ్రీనివాస్​ గౌడ్​, గగన్​ నారంగ్​

భవిష్యత్తులో భారతదేశం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్లే సగం మందిలో తెలంగాణ నుంచే వెళ్లేలా క్రీడాకారులను తయారు చేయాలని క్రీడా శాఖ మంత్రి(sports minister) శ్రీనివాస్​ గౌడ్ షూటర్​ గగన్​ నారంగ్​ను​ కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీలో చీర్‌ ఫోర్‌ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

sports minister: అందులో సగం మన వారే ఉండాలి: శ్రీనివాస్​ గౌడ్​

టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో భారతదేశం నుంచి షూటింగ్‌లో పాల్గొనేందుకు 15 మంది క్రీడాకారులు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని.. దీని వెనుక షూటర్‌ గగన్‌ నారంగ్‌ కృషి ఎంతో ఉందని క్రీడాశాఖ మంత్రి(sports minister) శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. గగన్‌ నారంగ్‌ అకాడమీ గన్‌ ఫర్‌ గ్లోరీ నుంచి ఐదుగురు క్రీడాకారులు ఎంపికవ్వడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో భారతదేశం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్లే సగం మందిలో తెలంగాణ నుంచే వెళ్లేలా తయారు చేయాలని కోరారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని గన్‌ ఫర్‌ గ్లోరీ షూటింగ్‌ అకాడమీలో నిర్వహించిన చీర్‌ ఫోర్‌ ఇండియా కార్యక్రమానికి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఒలింపిక్స్‌కు వెళ్లిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో బ్యాడ్మింటన్‌ లాగే షూటింగ్‌ క్రీడను అభివృద్ధి చేస్తున్నట్లు షూటర్‌ గగన్‌ నారంగ్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌ క్రీడకు అన్నివిధాలుగా సహాయ, సహాకారాలు అందిస్తోందన్నారు. వచ్చే ఒలింపిక్స్​కి హైదరాబాద్‌ నుంచి క్రీడాకారులు వెళ్లేలా కృషి చేస్తానని గగన్‌ నారంగ్‌ స్పష్టం చేశారు.

భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి గగన్​ నారంగ్​. నారంగ్​ అకాడమీ ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దింది. షూటింగ్​ అంటేనే గుర్తొచ్చేది గగన్​ నారంగ్​. అతను అంకితభావం గల వ్యక్తి. దేశం నుంచి 15 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌ వెళ్లారంటే దానికి కారణం నారంగ్​.

-శ్రీనివాస్‌ గౌడ్‌, క్రీడా శాఖమంత్రి

2002లో నేను పథకం సాధించినప్పుడు అకాడమీ ఏర్పాటు చేశాను. అది తెలంగాణలో కాదు. కేసీఆర్​, కేటీఆర్​ను కలిస్తే ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. అకాడమీ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు దాటింది. కేంద్ర నిధులు కూడా తీసుకొచ్చాం. మూడు కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు ఏర్పాటు చేశాం. జిల్లాలు, పాఠశాలల్లో ప్రతిభ ఉన్నవాళ్లను గుర్తించి వారికి శిక్షణ ఇస్తాం. కొంత మంది ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు.

-గగన్‌ నారంగ్‌, షూటర్‌

ఇదీ చదవండి: ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ సినిమాలు.. మీకు సూపర్​ కిక్!

Olympics: ఆరంభ మ్యాచ్​లో ఆతిథ్య జపాన్​ శుభారంభం

Tokyo Olympics: కుర్రాళ్లేనా.. మేమూ అదరగొడతాం!

Last Updated :Jul 21, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.