ETV Bharat / state

Revanth Readdy Letter to Tenant Farmers : 'వరంగల్​ డిక్లరేషన్​లోని ప్రతి హామీ నెరవేరుస్తాం'.. కౌలు రైతులకి రేవంత్ బహిరంగ లేఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 5:05 PM IST

Revanth Readdy Letter to Tenant Farmers on Warangal Declaration : వరంగల్​ డిక్లరేషన్​లో రైతుల కోసం చేసిన హామీలన్ని నెరవేరుస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి కౌలు రైతులకి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను గాలికి వదిలేశాయని ఆరోపించారు.

Congress Warangal Declaration
Revanth Readdy Letter to Tenant farmers

Revanth Readdy Open Letter to Tenant Farmers : కౌలు రైతులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాబోయే రోజుల్లో వరంగల్ రైతు డిక్లరేషన్(Warangal Rythu Declaration) సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని రాసిన లేఖలో భరోసా ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచనకు నాంది పలికిందే కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. పావలా వడ్డీకే రుణాలు, పంట బీమా, రైతు బీమా, ఇందిర జలప్రభ, రాయితీ విత్తనం, పెట్టుబడి రాయితీ, పంటకు మద్ధతు ధర, ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ కేంద్రాల ఏర్పాటు వంటి సమగ్ర రైతు అనుకూల నిర్ణయాలతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది తమ పార్టీనేనని స్పష్టం చేశారు.

Congress Warangal Declaration Guarantees : వ్యవసాయం చేసి కూడా ప్రతి ఏటా కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరని.. దీంతో పాటు గిట్టుబాటు ధర దక్కక కుదేలవుతున్నారన్నారు. కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి సాగులోకి దిగినా భవిష్యత్‌పై బెంగ.. గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రణాళిక లోపం, విధానరాహిత్యం వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగం పరిస్థితి దయనీయంగా తయారైందని ఆరోపించారు.

Congress Free Electric City Promise in Telangana : సాగుకు పూర్వవైభవం తేవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉన్నదని.. పరిస్థితులు విశ్లేషించి సాగు చేసే ప్రతి ఒక్కరికి భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌కు రూపకల్పన చేసిందన్నారు. గతేడాది మేలో రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం(Indiramma Rythu Bhrosa Scheme) తెచ్చి భూమి కలిగిన రైతులు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏటా రూ.15 వేలు పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు.

Revanth Reddy Zoom Meeting With DCC Presidents : 'విజయభేరి బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చేలా చూడాలి'

Revanth Reddy Comments on Government : అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే విధంగా హామీ ఇచ్చారని, మెరుగైన పంటల బీమా పథకం తెచ్చి.. ప్రకృతి విపత్తుల వల్లనో లేదా మరో కారణంగా పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టం అంచనా వేయించి పరిహారం అందేలా చూస్తామని లేఖలో ప్రస్తావించారు. రైతుల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే వరంగల్ డిక్లరేషన్నని.. కర్షకులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ఆరోపించారు. రాబోయే వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. రైతుల తలరాతను మారుస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైతు రాజ్యస్థాపనే కాంగ్రెస్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి మాట అమలు చేసి తీరుతాం.. రైతులెవ్వరూ ఆధైర్యపడొద్దని స్పష్టం చేశారు.

Revanth Reddy on Palamuru RangaReddy Project : 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండానే బీఆర్ఎస్ ప్రారంభిస్తోంది'

Revanth Reddy Vs Jagadeesh Reddy : 'ఉచిత్‌ విద్యుత్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పుడైనా సమీక్ష చేశారా..?'

Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.