ETV Bharat / state

Congress warangal Declaration: జనంలోకి వరంగల్ డిక్లరేషన్... నెల రోజుల పాటు రైతు రచ్చబండ

author img

By

Published : May 17, 2022, 9:23 AM IST

Congress warangal Declaration: వరంగల్‌ డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ కార్యాచరణకు శ్రీకారంచుట్టింది. ఈనెల 21 నుంచి వచ్చేనెల 21 వరకు నెల రోజుల పాటు 400 వందలమంది పార్టీ ముఖ్య నేతలతో రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. వరంగల్‌ డిక్టరేషన్‌లోని తొమ్మిది అంశాలపై పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కరపత్రాలు ముద్రింప చేసి గ్రామ, గ్రామాన, ఇంటి ఇంటికి చేరవేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Congress warangal Declaration
జనంలోకి వరంగల్ డిక్లరేషన్

Congress warangal Declaration: వరంగల్ రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రకటించిన 9 అంశాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలోప్రధానంగా వరంగల్‌ రైతు డిక్లరేషన్‌, ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌ నిర్ణయాలను అభినందిస్తూ ఆమోదించింది. వరంగల్ డిక్లరేషన్‌లోని అంశాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను పీసీసీ సిద్ధం చేసింది. 400మంది కాంగ్రెస్ నాయకులను ఇందుకోసం రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ నెల 21వ తేదీ నుంచి జూన్‌ 21 వరకు నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

వరంగల్ రైతు డిక్లరేషన్‌పై అంతగా చర్చ జరగకూడదనే తెరాస, భాజపాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జాతీయ స్థాయిలో భాజపా.. రాష్ట్ర స్థాయిలో తెరాస... మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నాయని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇది దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్ విధానాలను ప్రజలకు వివరిస్తూనే ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందాన్ని ఎండగడతామన్నారు.

జనంలోకి వరంగల్ డిక్లరేషన్... నెల రోజుల పాటు రైతు రచ్చబండ

జూన్‌ 2న వరంగల్‌ జిల్లాలో ఆచార్య జయశంకర్‌ సొంతగ్రామంలో నిర్వహించనున్న రైతు రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. అక్టోబర్‌ రెండు నుంచి రాహుల్‌ చేపట్టనున్న పాదయాత్రను తెలంగాణ నుంచి చేపట్టాలని తీర్మానం చేసి ఏఐసీసీకి పంపించిన పీసీసీ ఈ మేరకు సోనియా, రాహుల్‌ గాంధీకి లేఖ రాయాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి అకాల వర్షం వల్ల నష్ట పోయిన రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని పీసీసీ ప్రకటించింది.

ఇవీ చూడండి:'రాహుల్‌ గాంధీని తెలంగాణలో పాదయాత్ర చేయమని కోరతాం'

నాట్యాన్నీ.. 'నీచం చేశారు'.. వారిని వ్యభిచారులుగా మార్చారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.