ETV Bharat / state

వైభవంగా రామోజీరావు మనవరాలి వివాహం.. తరలివచ్చిన అతిరథమహారథులు

author img

By

Published : Apr 17, 2022, 4:38 AM IST

Updated : Apr 17, 2022, 11:34 AM IST

రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయం.. వైభవంగా జరిగింది. దండమూడి అమర్ మోహన్ దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్‌తో.. బృహతి కల్యాణం కమనీయంగా సాగింది. అచ్చతెలుగు సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లి సందడికి.. రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది.

RAMOJI RAO GRAND DAUGHTER BRIHATHI AND VENKAT AKSHAY WEDDING
RAMOJI RAO GRAND DAUGHTER BRIHATHI AND VENKAT AKSHAY WEDDING

వైభవంగా రామోజీరావు మనవరాలి వివాహం.. తరలివచ్చిన అతిరథ మహారథులు

రామోజీ గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ మహోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ అపురూప ఘట్టానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. వధువు బృహతి ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజల ద్వితీయ కుమార్తె. వరుడు వెంకట్‌ అక్షయ్‌.. దండమూడి అమర్‌ మోహన్‌దాస్‌, అనితల కుమారుడు. వివాహ మహోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, సినీ నటులు రజనీకాంత్‌, చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా రాజకీయ, న్యాయ, సినీ, వైద్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాత్రి 12.18 గంటలకు సంప్రదాయబద్ధంగా జీలకర్ర-బెల్లం కార్యక్రమం నిర్వహించారు. కల్యాణఘట్టానికి ముందు.. వేద పండితుల మంత్రాశీర్వచనాలు, మంగళ వాయిద్యాల నడుమ వధూవరులకు పుష్పఛత్రాలు పట్టి.. వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. కల్యాణవేదికను ఆలయ సంప్రదాయ నిర్మాణశైలి ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సప్తవర్ణ రంజితంగా.. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో, విభిన్న పుష్పాలంకరణలతో వివాహవేదిక ప్రాంగణమంతా నయన మనోహరంగా కనిపించింది. బంధు మిత్రుల సాక్షిగా వెంకట్‌ అక్షయ్‌, బృహతి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

RAMOJI RAO GRAND DAUGHTER BRIHATHI AND VENKAT AKSHAY WEDDING
కొత్తజంటతో.. సకుటుంబసపరివారం..

రామోజీగ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలు బృహతి, అక్షయ్‌ల వివాహ మహోత్సవానికి అతిరథ మహారథులైన ఎందరో ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, భాజపా ఓబీసీ విభాగం జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు రఘురామకృష్ణరాజు, కేశినేని నాని, సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.రామ్మోహన్‌రావు వధూవరులను ఆశీర్వదించారు.

RAMOJI RAO GRAND DAUGHTER BRIHATHI AND VENKAT AKSHAY WEDDING
వధూవరులతో సీఎం కేసీర్​..

న్యాయ నిపుణుల దీవెనలు..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ ఎం.గంగారావు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌ (పరిపాలన) డి.వెంకటరమణ, ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్‌ సభ్యురాలు జస్టిస్‌ రజని, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.శ్రీసుధ, జస్టిస్‌ సి.సుమలత, జస్టిస్‌ జి.రాధారాణి, జస్టిస్‌ పి.మాధవీదేవి, జస్టిస్‌ కె.సురేందర్‌, జస్టిస్‌ ఎస్‌.నంద, జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌, జస్టిస్‌ జె.శ్రీదేవి, జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌, జస్టిస్‌ జి.అనుపమా చక్రవర్తి, జస్టిస్‌ ఎంజీ ప్రియదర్శిని, జస్టిస్‌ ఎ.సాంబశివరావు నాయుడు, జస్టిస్‌ డి.నాగార్జున, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం వధూవరులను ఆశీర్వదించారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు కుటుంబసమేతంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

RAMOJI RAO GRAND DAUGHTER BRIHATHI AND VENKAT AKSHAY WEDDING
వధూవరులతో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు..

రాజకీయ ప్రముఖుల ఆశీస్సులు..

తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్‌కుమార్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, తెలంగాణ వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.

ఉన్నతాధికారులు, విద్యాసంస్థల అధినేతల శుభాశీస్సులు..

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ అదనపు డీజీ అంజనీకుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌, ఏపీ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీపీ జేవీ రాముడు, ఒడిశా ఆదాయపన్ను (ఇన్వెస్టిగేషన్‌) విభాగం ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జాస్తి కృష్ణకిశోర్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, ఎల్బీనగర్‌ డీసీపీ నన్‌ప్రీత్‌సింగ్‌, శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సహా పలువురు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

RAMOJI RAO GRAND DAUGHTER BRIHATHI AND VENKAT AKSHAY WEDDING
వధూవరులను ఆశీర్వధిస్తోన్న పవన్​కల్యాణ్​..

సినీ ప్రముఖులు..

మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ప్రముఖ నిర్మాతలు మురళీమోహన్‌, అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, డి.సురేశ్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, కె.ఎల్‌.నారాయణ, శోభు యార్లగడ్డ, జెమినీ కిరణ్‌, అక్కినేని నాగసుశీల, దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సతీమణి రమా రాజమౌళి, బోయపాటి శ్రీను, వైవీఎస్‌ చౌదరి, ప్రముఖ నటులు మోహన్‌బాబు, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, రాజేంద్రప్రసాద్‌, అలీ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, నరేశ్‌, రాజశేఖర్‌, జీవిత, యమున, జయసుధ, గాయని సునీత, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, యాంకర్లు సుమ, ఉదయభాను వధూవరులను ఆశీర్వదించారు.

RAMOJI RAO GRAND DAUGHTER BRIHATHI AND VENKAT AKSHAY WEDDING
వివాహ వేడుకలో చిరంజీవి దంపతులు, రాఘవేంద్రరావు..

వైద్య నిపుణులు..

ప్రముఖ వైద్యులు బొల్లినేని భాస్కరరావు, ఎంవీరావు, పావులూరి కృష్ణచౌదరి, మన్నం గోపీచంద్‌, గురవారెడ్డి, నరేంద్రనాథ్‌, అనూరాధ, గోపాలకృష్ణగోఖలే, రఘురామ్‌, గూడపాటి రమేశ్‌, బీఎస్‌రావు, సెంథిల్‌ రాజప్ప, సుబ్బయ్యచౌదరి, వై.వెంకట్రావు, శరత్‌చంద్రమౌళి, మానస్‌ పాణిగ్రాహి, రమణప్రసాద్‌, విష్ణుస్వరూప్‌రెడ్డి, గీతానాగశ్రీ, జానకీశ్రీనాథ్‌ వధూవరులకు ఆశీస్సులు అందించారు.

వ్యాపార దిగ్గజాల దీవెనలు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పూర్వ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ గ్రంధి మల్లికార్జునరావు, దివీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకులు మురళి కె.దివి, నవయుగ గ్రూప్‌ ఛైర్మన్‌ సి.విశ్వేశ్వరరావు, మైహోం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు, ఆర్‌వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వాహకులు ఆర్‌.వెంకటేశ్వరరావు, రఘు, మేఘా ఇంజినీరింగ్‌ ఎండీ కృష్ణారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేశ్‌, శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకులు వరప్రసాద్‌రెడ్డి, సంఘీ సంస్థల నుంచి గిరీష్‌ సంఘీ, సైయెంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, శ్రీనివాస ఫార్మ్స్‌ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ చిట్టూరి సురేశ్‌ రాయుడు, ఫార్చ్యూన్‌ హోటల్‌ (విజయవాడ) అధిపతి ముత్తవరపు మురళీకృష్ణ, శ్రీశక్తి గ్రూప్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ డీవీ మనోహర్‌, జెన్‌ సెక్యూరిటీస్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌ కంతేటి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్‌ వి పొట్లూరి, ప్రసాద్‌ స్టూడియోస్‌ అధినేత అక్కినేని రమేశ్‌ ప్రసాద్‌, సీవీఆర్‌ ఛానల్‌ అధినేత సీవీరావు, మలయాళ మనోరమ నుంచి జాకబ్‌ మాథ్యూస్‌, రాజస్థాన్‌ పత్రిక నుంచి సిద్ధార్థ్‌ కొఠారి, స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్‌ తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

తరలివచ్చిన అతిరథ మహారథులు

ఇదీ చూడండి..

బృహతి - అక్షయ్​ వివాహ వేడుక మహోత్సవం..

Last Updated : Apr 17, 2022, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.