ETV Bharat / state

పనితీరులో రాజేంద్రనగర్​ పీఎస్ బాద్​షా- అమిత్​షా చేతులమీదుగా ట్రోఫీ ప్రధానం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 10:33 PM IST

Rajendra Nagar PS awarded Best Police Station in India
పనితీరులో రాజేంద్రనగర్​ పీఎస్ బాద్​షా- అమిత్​షా చేతులమీదుగా అవార్డు ప్రదానం

Rajendra Nagar PS Awarded Best Police Station in India : తెలంగాణకు మరో గౌరవం దక్కింది. పనితీరులో దేశంలోనే అత్యుత్తమ పొలీస్​స్టేషన్​గా రాజేంద్రనగర్ పీఎస్​ ఎంపిక అయింది. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ ఇన్​స్పెక్టర్ నాగేంద్రబాబు​ ట్రోఫీని అందుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు.

Rajendra Nagar PS awarded Best Police Station in India : దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఎస్​గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(Ministry of Home Affairs) 2023 సంవత్సరానికి దేశంలోనే అత్యుత్తమ పోలీస్​స్టేషన్ల జాబితాను ప్రకటించింది. అందులో భారతదేశంలో ఉన్న దాదాపు 17 వేలకు పైగా ఉన్న పోలీస్​స్టేషన్లలో రాజేంద్రనగనర్ పోలీస్​స్టేషన్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

కానిస్టేబుల్‌ పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవరించిన హైకోర్టు ధర్మాసనం

జైపూర్​లో జరిగిన అన్నిరాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah)చేతుల మీదుగా రాజేంద్రనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(Station House Officer) బి.నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు. దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అధికారులను అభినందనలు తెలిపారు. ఈ జాబితాలో ద్వితీయ, తృతీయ బహుమతులను కశ్మీర్, పశ్చిమబెంగాల్​ రాష్ట్రాలు గెలుచుకున్నాయి.

పోలీస్​స్టేషన్ల పనితీరు ఆధారంగా వివిధ రకాల ప్రామాణికాలను పరిశీలించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బహుమతులను ప్రకటించింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల దర్యాప్తు తీరు ఆధారంగా పోలీస్​స్టేషన్ భవన నిర్వహణ తదితర అంశాలు ఆధారంగా ఈ ట్రోఫీకి ఎంపిక చేశారు. మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలను కేంద్రహోం మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించి ఈ బహుమతులను ప్రకటించారు.

బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి : రాచకొండ సీపీ

Rajendra Nagar PS Receives MHA Award : సీసీటీఎన్ఎస్ ద్వారా రెండవ దశలో 75 పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేసి చివరకు దేశంలోనే రాజేంద్రనగర్ పోలీస్​స్టేషన్​ను అత్యుత్తమ పోలీస్​స్టేషన్​గా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శుక్రవారం నాడు జైపూర్​లో జరిగిన డీజీపీల(DGP)సదస్సులో రాజేంద్రనగర్ ఇన్​స్పెక్టర్ నాగేంద్రబాబు మొదటి బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అభినందించారు.

MHA Best PS Award : ఇటీవల రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో ఉందని తెలుసుకున్న డీజీపీ రవి గుప్తా(DGP Ravi Gupta), అడిషనల్ డీజీపీ శిఖా గోయల్​లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, నాటి డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, తదితరులను అభినందించారు.

'దమ్ముంటే నా ఇంటిపై బాంబులు విసరండి'- ఉగ్రసంస్థకు DGP ఛాలెంజ్​- సవాల్​కు రెడీ అంటూ తీవ్రవాదుల ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.