ETV Bharat / state

'మహిళలకు క్యాన్సర్​పై మరింత అవగాహన కల్పించాలి'

author img

By

Published : Oct 7, 2019, 3:15 PM IST

హైదరాబాద్​లో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కోసం జోడించిన ఏఆర్ టెక్నాలజీను ఆవిష్కరించే కార్యక్రమానికి బ్యాడ్మింటన్ పీవీ సింధూ హాజరయ్యారు.

'మహిళలకు క్యాన్సర్​పై మరింత అవగాహన కల్పించాలి'


హైదరాబాద్​లో రొమ్ము క్యాన్సర్​పై అవగాహనకు సాంకేతికకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్​ను జోడించింది. హోటల్​ పార్క్ హయత్​లో ఏఆర్ టెక్నాలజీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధూ హాజరయ్యారు. అక్టోబరు నెల క్యాన్సర్ అవగాహన మాసం కావటం పట్ల పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌పై నిరంతరం అవగాహన కల్పిస్తోన్న ఉషా లక్ష్మీ ఫౌండేషన్ కృషిని ఆమె అభినందించారు. క్యాన్సర్‌పై అవగాహనను పెంచేందుకు ఏఆర్ టెక్నాలజీను జోడించటం ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు మరింత దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు ఈ ప్రచారం విస్తృతంగా జరగాలని పీవీ సింధూ ఆకాంక్షించారు.

'మహిళలకు క్యాన్సర్​పై మరింత అవగాహన కల్పించాలి'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.