ETV Bharat / state

మహానగరంలో యథాస్థితికి ప్రజాజీవనం.. రహదారులపై సందడి

author img

By

Published : Sep 28, 2020, 11:04 AM IST

హైదరాబాద్‌లో కొవిడ్‌కు ముందున్న సందడి మళ్లీ కనిపిస్తోంది. లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన నగరం మళ్లీ జనంతో కళకళలాడుతోంది. ఏ గల్లీ చూసినా కనిపించిన టూలెట్‌ బోర్డులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఇప్పటికే మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి రాగా.. ఆదివారం నుంచి ఉద్యానవనాలు, పబ్బులు, బార్లు మొదలయ్యాయి. ఇటీవల వరకు వ్యాపారాలు లేక బోసిపోయిన ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో నిండిపోయాయి. సినిమా హాళ్లు మినహా దాదాపు అన్ని కార్యకలాపాలు యథాస్థితికి చేరుకున్న నేపథ్యంలో ఒక్కసారి పరిస్థితి చూద్దామా.

Public life to the status quo in Hyderabad
మహానగరంలో యథాస్థితికి ప్రజాజీవనం.. రహదారులపై సందడి

ఆహ్లాదకర క్షణాల నడుమ వంతెనపై నడుస్తూ సందర్శకుల ముచ్చట్లు

పార్కులు.. పర్యాటకందాలు..!

అన్ని ఉద్యానవనాలు తెరుచుకోవడంతో ఆదివారం సందర్శకులు పెద్దఎత్తున రావడం కనిపించింది. నెక్లెస్‌రోడ్‌ వద్ద మరమ్మతు పనులు జరుగుతుండటంతో ఒక వరసకే అనుమతించారు. అయినా సాయంత్రం అధిక సంఖ్యలో చేరుకున్నారు. మొజంజాహీ మార్కెట్‌, చార్మినార్‌ పరిసరాల్లోనూ రద్దీ కనిపించింది. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ వద్దకు పలువురు కుటుంబాలతో సహా వచ్చారు.

వాణిజ్య కేంద్రాలలో..

మొన్నటివరకు కళ తప్పిన వాణిజ్య సముదాయాలు.. వస్త్ర బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కనిపిస్తున్నాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, అబిడ్స్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, సికింద్రాబాద్‌ వంటి చోట్ల జనం ఎక్కువగా కనిపిస్తున్నారు. హాస్టళ్లకు విద్యార్థులు, ఉద్యోగులూ ఇప్పుడిప్పుడే వచ్చి చేరుతున్నారు.

వివరాలిలా...

ఐటీ నగరి ఒక్కటే

నగర ప్రగతిలో కీలక ప్రాంతం ఐటీ నగరి. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాలన్నీ ఒకప్పుడు రాత్రీ పగలు తేడా లేకుండా వెలుగులీనేవి. లాక్‌డౌన్‌ మొదలు దాదాపు 90శాతం ఐటీ సంస్థలు ఉద్యోగులతో ఇంటి నుంచే పనిచేయిస్తున్నాయి. అంతా సొంతూళ్లకు, గదులకు పరిమితమవడంతో ఈ ప్రాంతంలో గత హడావిడి లేదు. లాక్‌డౌన్‌ తరహా వాతావరణమే కనిపిస్తోంది.

వివరాలిలా

నగర బాట.. ఉపాధి వేట

కరోనా వైరస్‌ తెచ్చిన కష్టాలతో చాలావరకు చిరుద్యోగులు, వలస కార్మికులు ఉపాధి కోల్పోయి సొంత గ్రామాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాస్త కరోనా ప్రభావం తగ్గడం, నెలల తరబడి ఖాళీగా ఉండలేక తిరిగొస్తున్నారు. పరిశ్రమలూ, వ్యాపార కార్యకలాపాలు గాడిన పడుతున్నాయి. నిరుద్యోగులంతా జీవనోపాధి కోసం మళ్లీ ఇటు చూస్తున్నారు.

వివరాలిలా

ప్రజారవాణా.. వ్యక్తిగత వాహనాలు

నగరంలో మార్చి 22 నుంచి ప్రజారవాణా ఆగిపోయింది. ఆ తర్వాత వ్యక్తిగత వాహనాలు పెరిగాయి. ఈనెల 7 నుంచి మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభం కాగా, 25 నుంచి సిటీ బస్సులూ రోడ్డెక్కాయి. ప్రధాన కూడళ్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి.

వివరాలిలా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.