ETV Bharat / state

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన - ఆ రూట్​లో పటిష్ఠ బందోబస్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 8:25 AM IST

President Droupadi Murmu Visits Pochampally Today : శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇవాళ పోచంపల్లిలో పర్యటించనున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి, చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. 350 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖిలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

President Droupadi Murmu Winter Session in Telangana
President Droupadi Murmu

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన - ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

President Droupadi Murmu Visits Pochampally Today : మగువలు మెచ్చే పట్టుచీరలకు నిలయం, దేశంలోనే మొదటి సారిగా భూదానం జరిగిన పవిత్ర ప్రదేశం, ఈ అంశాలే పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ యూఎన్​డబ్ల్యూటీవో నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పోచంపల్లిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు సందర్శించనున్నారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రానున్న రాష్ట్రపతికి అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. పట్టుచీరలకు నిలయమైన పోచంపల్లిలో చేనేత వస్త్రకళా నైపుణ్యాన్ని స్వయంగా ద్రౌపది ముర్ము తిలకించనున్నారు. గ్రామీణ పర్యాటక కేంద్రంలోని వినోభా మందిరాన్ని సందర్శించి భూదానోద్యమ చరిత్రను తెలిపే ఫొటోగ్యాలరీని తిలకిస్తారు.

President Droupadi Murmu Winter Vacation in Telangana : భూదాన ఉద్యమకారుడు వినోభా బావే, భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. చేనేత గృహాలను సందర్శించిన అనంతరం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారయ్యే అన్ని చేనేత వస్త్రాలతో బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకిస్తారు. సంత్‌కబీర్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, చేనేత కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి రాష్ట్రపతి హాజరవుతారు.

హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి - రేపు పోచంపల్లిలో పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు జిల్లా కలెక్టర్‌తో కలిసి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, వాయుసేన, పారామిలిటరీ దళాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. బాలాజీ ఫంక్షన్ హాల్​తో పాటు హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలను బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

President Droupadi Murmu Telangana Tour Updates : మరోవైపు నగరంలో అన్ని ప్రధాన రహదారి కూడళ్ల వద్ద భారీకేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ దృష్ట్యా వాహనాలను దారి మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాలతో పంపిస్తున్నారు. రాచకొండ కమిషనర్ రేట్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు, అదనపు సీపీ తరుణ్ జోషి, డీసీపీ రాజేశ్​ చంద్రల టీం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రపతి వ్యక్తిగత ప్రత్యేక రక్షణ దిల్లీ వాయుసేన సిబ్బంది రూట్ మ్యాప్ ప్రకారం ఈ పర్యటన సాగనున్నట్లు సమాచారం. ద్రౌపది ముర్ము పర్యటన సమయంలో కార్మికులకు, నాయకులకు, అధికారులకు ఎంట్రీ పాస్ ఉన్న వాళ్లకు మాత్రమే సభాస్థలి సమావేశానికి అనుమతి ఉంటుందని తెలుస్తోంది. మీడియా కూడా అనుమతి లేదని సమాచారం. అలాగే పాస్ ఉన్నప్పటికీ కరోనా టెస్ట్, ఆధార్ కార్డ్ తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది.

శీతాకాల విడిదికై రాష్ట్రానికి రాష్ట్రపతి రాక - స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి - ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.