ETV Bharat / state

drugs seized: హైదరాబాద్​లో మరో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్

author img

By

Published : Apr 29, 2023, 8:10 PM IST

drugs seized: రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ముఠాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంతో నిఘా పెట్టి ఈ ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్​లో డ్రగ్స్​ను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల ముఠా నుంచి 2లక్షల విలువగల డ్రగ్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంలో గంజాయి, హాష్ ఆయిల్​ వేర్వేరుగా విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

police seized drugs in hyderabad
హైదరాబాద్​లో పెరిగిపోతున్న డ్రగ్స్ విక్రయం

police seized drugs in hyderabad: రాజధానిలో పోలీసుల నిఘా ఎంత తీవ్రంగా ఉన్నా.. డ్రగ్స్ స్మగ్లర్లు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఇలాగే బెంగళూరు నుంచి సిటీకి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కూకట్​పల్లిలో విక్రయిస్తుండగా... ఇద్దరు వ్యక్తుల ముఠాను కూకట్​పల్లి పోలీసులు అరెస్టు చేశారు. యూసుఫ్ షరీఫ్, షహబాజ్ ఖాన్ బెంగళూరులో బట్టల దుకాణంలో సేల్స్ మెన్​గా పనిచేసే జీవనం సాగించేవారు. చేస్తున్న పని నుంచి వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్​ను కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అమ్మకాలు చేసేవారు. వీరిద్దరు కూకట్​పల్లి వై జంక్షన్ ప్రాంతంలో ఉదయం 8 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారి దగ్గరకి వచ్చి పరిశీలించగా డ్రగ్స్ ఉన్నాయి. వారి వద్ద నుంచి 2లక్షల 20వేల రూపాయలు విలువ చేసే 22.9 గ్రాముల ఎండిఎంఏ (నిషేధిత డ్రగ్), 3ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

మూసాపేటలో డ్రగ్స్ విక్రయం: మరో ఘటనలో విశాఖపట్నం నుంచి ఎండు గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్​లో విక్రయిస్తున్న వ్యక్తిని కూకట్​పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కూకట్​పల్లి మూసాపేటలో నివాసముంటూ వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న దుప్పాల నరేశ్(22) సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఆ దుర్బుద్దితోనే విశాఖపట్నంలో బాలాజీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి కూకట్​పల్లి మూసాపేట్ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు. ఈరోజు ఉదయం మూసాపేట్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కిలో 700 గ్రాముల ఎండు గంజాయిని, ఒక ఫోన్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు 25 వేల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్: హాష్‌ ఆయిల్​ను విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నార్కొటిక్‌ విభాగం, హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండున్నర కిలోల హాష్‌ఆయిల్, 5ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో కరుడుగట్టిన మాదకద్రవ్యాల విక్రేత సంతోష్‌రెడ్డి ఉన్నాడు. ప్రధాన నిందితుడు సంతోష్‌కు ఏపీలోని పరిచయస్తుల నుంచి హాష్‌ ఆయిల్‌ నగరానికి తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. సంతోష్‌పై ఇప్పటికే పలు స్టేషన్లలో కేసులుండగా, తాజాగా పీడీ చట్టం ప్రయోగిస్తామని నార్కొటిక్‌ డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలానికి చెందిన జిమ్మెల్లి బంధు, మాడుగుల మండలానికి చెందిన కాపు చందర్‌రావు, హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ వాసి సాయి భరత్‌, హరితేజ కలిసి ముఠాగా ఏర్పడి ఒడిశా నుంచి విశాఖ మీదుగా హాష్‌ ఆయిల్‌ తీసుకువచ్చి సంతోష్‌రెడ్డికి అందజేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వీరు అధికంగా కొంటున్నారు: హాష్‌ ఆయిల్​ను 5ml సీసాల్లో నింపి అవసరమైన వారికి ముఠా విక్రయిస్తోందని పోలీసులు చెప్పారు. ఒక్కో సీసా రూ.2 వేల నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నట్లు నార్కొటిక్‌ విభాగం డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. వీరి నుంచి హాష్‌ ఆయిల్‌ కొంటున్న వారిలో వైద్యులు,ఐటీ ఉద్యోగులు, వైద్య విద్యార్థులున్నట్లు చెప్పిన పోలీసులు చెప్పారు. త్వరలోనే వినియోగదారులను అరెస్టు చేస్తామని వెల్లడించారు.

"వినియోగదారులకు 5గ్రాములు ఇస్తారు. ఎక్కువ మొత్తంలో కావాలంటే 20గ్రాములు చేసి బాటిల్​లో పోసి అమ్ముతుంటారు. 5ml హాష్ హాష్ ఆయిల్ రెండు నుంచి మూడు వేల రూపాయలకు వీరు అమ్ముతున్నారు. వీరందరిని మేం పట్టుకున్నాము. వీరి నుంచి హాష్ ఆయిల్ పొందుతున్న 11మందిని మేము గుర్తించాము. వారిని కూడా పట్టుకుంటాము."_గుమ్మి చక్రవర్తి, నార్కోటిక్‌ విభాగం డీసీపీ

హైదరాబాద్​లో హాష్ ఆయిల్​ను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.