ETV Bharat / state

viral video: యువకుడిని చితకబాదిన ఎస్సై

author img

By

Published : May 27, 2021, 9:01 PM IST

video virul
ap police

ఏపీలోని కడపలో ఓ ఎస్సై అత్యుత్సాహం విమర్శలు తావిస్తోంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకుడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

ఏపీలోని కడప రెండో పట్టణం పరిధిలో ఓ యువకుడు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ద్విచక్రవాహనాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నంలో కింద పడ్డాడు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానిక ఎస్ఐ జీవన్​రెడ్డి... యువకుడి వద్దకు చేరుకుని లాఠీతో చితకబాదాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ సంబంధిత ఎస్​ఐపై చర్యలకు ఉపక్రమించారు.

యువకుడిని చితకబాదిన ఎస్సై... వీడియో వైరల్

ఇదీ చూడండి: police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.