ETV Bharat / state

LIVE UPDATES: గిర్నితండాలో ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు

author img

By

Published : Feb 27, 2023, 6:32 AM IST

Updated : Feb 27, 2023, 1:18 PM IST

preethi
ప్రీతి

13:06 February 27

గిర్నితండాలో ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు

  • గిర్నితండాలో ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు

12:24 February 27

గిర్నితండాలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలు, తండా వాసులు

  • గిర్నితండాలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ నేతలు, తండా వాసులు
  • రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఇతర నేతలు
  • ఆందోళన కారులను సముదాయిస్తున్న పోలీసులు
  • పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట
  • జనగామ: ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు

12:21 February 27

ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు: ప్రీతి తండ్రి

  • జనగామ: శోకసంద్రంగా వైద్య విద్యార్థిని ప్రీతి స్వస్థలం గిర్నితండా
  • ప్రీతిది ఆత్మహత్య కాదు హత్య: ప్రీతి తండ్రి నరేందర్
  • ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే: ప్రీతి తండ్రి
  • ప్రీతి మృతి కారకులైన అందరి పేర్లు బయటకు రావాలి: ప్రీతి తండ్రి
  • బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలి: ప్రీతి తండ్రి నరేందర్‌
  • సైఫ్‌ను అరెస్టుతోనే సరిపెట్టాలని చూస్తున్నారు: ప్రీతి తండ్రి
  • సైఫ్‌ను వెంటనే ఉరితీయాలి: ప్రీతి తండ్రి నరేందర్‌
  • అమ్మాయిలను వేధించే వారికి గట్టి హెచ్చరిక పంపాలి: ప్రీతి తండ్రి
  • ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు: ప్రీతి తండ్రి
  • నా చెల్లి ధైర్యవంతురాలు, ప్రతిభావంతురాలు: ప్రీతి సోదరి
  • డిసెంబర్ నుంచే సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి చెప్పింది: ప్రీతి సోదరి
  • ఇటీవల సైఫ్‌ వేధింపులు తీవ్రమయ్యాయి: ప్రీతి సోదరి
  • మా చెల్లి మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలి: పూజ

11:01 February 27

కాకతీయ వైద్య కళాశాల ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నం

వరంగల్‌: కాకతీయ వైద్య కళాశాల ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నం

వరంగల్‌: ఏబీవీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట

విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

09:49 February 27

నా కూతురు ప్రీతిది ముమ్మాటికి హత్యే: ప్రీతి తండ్రి

నా కూతురు ప్రీతిది ముమ్మాటికి హత్యే: ప్రీతి తండ్రి

సీనియర్ విద్యార్థి సైఫ్ మొదట ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు: ప్రీతి తండ్రి

పక్కా ప్లాన్​తో చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు: ప్రీతి తండ్రి

ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించాను: ప్రీతి తండ్రి

విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. : ప్రీతి తండ్రి

06:40 February 27

భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు

  • జనగామలోని స్వగ్రామానికి చేరుకున్న వైద్య విద్యార్థిని ప్రీతి మృతదేహం
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ప్రీతి కుటుంబసభ్యులు, బంధువులు
  • భారీ పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు

06:10 February 27

పోలీస్ భద్రత మధ్య ప్రీతి మృతదేహం స్వస్థలానికి తరలింపు

  • హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో ప్రీతి మృతదేహానికి శవపరీక్ష పూర్తి
  • పోలీస్ భద్రత మధ్య ప్రీతి మృతదేహం స్వస్థలానికి తరలింపు
  • జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకి ప్రీతి మృతదేహం తరలింపు
  • నిన్న రాత్రి 9.10 గంటలకు నిమ్స్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి మృతి
  • ఈనెల 22 న వరంగల్‌ ఎంజీఎంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం
  • హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్సను అందించిన వైద్యులు
  • 5 రోజుల చికిత్స అనంతరం కన్నుమూసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి
  • ప్రీతి మృతికి నిరసనగా రాష్ట్రంలో వైద్య కళాశాల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
Last Updated :Feb 27, 2023, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.