ETV Bharat / state

Palla Rajeshwar Reddy on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గాంధీ.. ఎమ్మెల్సీ పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 2:17 PM IST

Palla Rajeshwar Reddy on CM KCR : గాంధీ విధానాలకు బీజేపీ తూట్లు పొడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. మరోవైపు తెలంగాణలో గాంధీ కలలు కన్న విధంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్ అని పల్లా అభివర్ణించారు.

Palla Rajeshwar Reddy Latest News
Palla Rajeshwar Reddy Comments on Modi

Palla Rajeshwar Reddy on CM KCR ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గాంధీ.. ఎమ్మెల్సీ పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

Palla Rajeshwar Reddy on CM KCR : గాంధీ విధానాలకు బీజేపీ తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజేశ్వర్​రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. గాంధీ సిద్దాంతాలతో తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్​ సాధించారని అన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా నేడు తెలంగాణలో పల్లెలు మారాయని చెప్పారు. తెలంగాణ గాంధీగా సీఎం కేసీఆర్​గా అభివర్ణించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల(Congress and BJP )పై విమర్శల వర్షం కురిపించారు.

Palla Rajeshwar Reddy Comments on PM Modi : పాలమూరు సభలో ప్రధాని మోదీ(PM Narendra Modi) అబద్ధాలు మాట్లాడారని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రలో చుక్క నీరు కూడా ఇవ్వలేదన్న ప్రధాని మాట్లలను గుర్తు చేస్తూ.. చుక్క నీరు లేకపోతే రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట సాగు ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్​ఇరిగేషన్​ ప్రాజెక్ట్​ని పూర్తి చేశామని పల్లా పేర్కొన్నారు. 2014లో 24 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం పండిందని.. ప్రస్తుతం 3 కోట్ల మెట్రిక్​ టన్నుల పండుతోందని వివరించారు. రాష్ట్రంలో ఒక్క చుక్క నీరు ఇవ్వకుంటే ఇంత అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని మోదీని పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు.

'హైదరాబాద్​ పర్యటనలో.. మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు'

Palla Rajeshwar Reddy On Modi Mahabubnagar Tour : మరోవైపు కాంగ్రెస్ పార్టీపైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కొత్త పథకాలను ఇస్తానని చెబుతోంది అని.. ముందు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో పథకాలను అమలు చేయాలని పల్లా సూచించారు. కాంగ్రెస్​ ఎన్ని గ్యారెంటీలు ఇచ్చానా.. మోదీ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా.. తెలంగాణ ప్రజలు కేసీఆర్​నే నమ్ముతారని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా బీఆర్​ఎస్​ పార్టీ మూడోసారిగా అధికారంలోకి వస్తుందని.. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్​గా కొనసాగేలా చేస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్​ కుటుంబం చాలా పెద్దదని.. ఈ విషయం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా అర్ధం చేసుకోలేక పోతున్నారని పల్లా వ్యాఖ్యానించారు.

"గాంధీ విధానాలకు బీజేపీ తూట్లు పొడుస్తోంది. పాలమూరు సభలో ప్రధాని మోదీ అబద్ధాలు మాట్లాడారు. రాష్ట్రంలో చుక్క నీరు ఇవ్వలేదని ప్రధాని చెప్పారు. 2014లో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండింది. ప్రస్తుతం 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండుతోంది. ఒక్క చుక్క నీరు ఇవ్వకుంటే ఇంత ధాన్యం పండేదా?. గాంధీ సిద్దాంతాలతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పల్లెలు మారాయి. పాలమూరు సభలో తెలంగాణ కోసం మోదీ కొత్తగా ప్రకటించిన విషయాలేం లేవు. పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఎప్పుడో ప్రతిపాదించిన విషయాలు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మోదీ మరోసారి వాటిని గుర్తు చేశారు." - పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

Palla Rajeswar Reddy Latest News : 'ఆర్థిక పరిస్థితుల వల్లే రుణమాఫీ ఆలస్యం'

MLC Palla Controversy Latest : 'ఆ మాటలు నావి కావు.. నేనలా అన్లేదు'.. పక్కా ప్రూఫ్ ఉన్నా.. మాట మార్చిన పల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.