ETV Bharat / state

జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ఏర్పడి నేటికి ఏడాది

author img

By

Published : Feb 11, 2022, 4:22 PM IST

GHMC one year celebrations: జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ఏర్పడి నేటికి ఏడాది పూర్తైంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు.

one year completed the formation of the GHMC governing body
జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ఏర్పడి నేటికి ఏడాది

GHMC one year celebrations: హైదరాబాద్‌ మహానగర పాలక వర్గం ఏర్పడి.. నేటికి ఏడాది పూర్తికావడంతో జీహెచ్​ఎంసీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మేయర్ విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కేక్ కట్‌చేశారు. జీహెచ్​ఎంసీ అధికారులు, ప్రజల సహకారంతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టినట్లు డిప్యూటీ మేయర్‌ తెలిపారు. ముంపు ప్రాంతాలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పిన ఆమె.. హైదరాబాద్‌ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజలు, అధికారుల సహకారంతో ఎన్నో చర్యలు చేపట్టాం. కాలనీలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్‌ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం.

- మోతే శ్రీలత, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్

జీహెచ్‌ఎంసీ పాలకవర్గం ఏర్పడి నేటికి ఏడాది

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.