ETV Bharat / state

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Mar 13, 2021, 8:35 PM IST

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బంజారాహిల్స్ పరిధిలో 3,419, జూబ్లీహిల్స్​లో 9,535 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.

Graduate election arrangements are complete
పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి జరుగనున్న పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్ పరిధిలో 3,419, జూబ్లీహిల్స్​ పోలింగ్ కేంద్రాల్లో 9,535 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

బంజారాహిల్స్‌లో 6, జూబ్లీహిల్స్​లో 15 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

ఇదీ చూడండి: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.