ETV Bharat / state

కేంద్రం నుంచి ఆర్థిక సాయంలో రాష్ట్రానికి మళ్లీ నిరాశే.. వచ్చే బడ్జెట్‌పై ప్రభావం

author img

By

Published : Jan 31, 2023, 7:19 AM IST

No financial support to Telangana from Central Government : కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాటు విషయంలో రాష్ట్రానికి నిరాశే మిగిలింది. గ్రాంట్లు, ప్రత్యేక నిధుల విషయంలో అంచనాలు తప్పాయి. కేంద్రం నుంచి ఈ ఏడాది లక్షా 5 వేల కోట్లు ఆశించగా, డిసెంబర్ నెలాఖరు వరకు 45 వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాకు చేరాయి. రుణ పరిమితిలోనూ కోత విధించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక ప్రణాళికపై పడింది. సొంత పన్ను ఆదాయం మాత్రం అంచనాలకు అనుగుణంగానే సమకూరుతోంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఖజానాకు అదనంగా 18వేల కోట్లకుపైగా సమకూరింది. కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రాని ప్రభావం.. వచ్చే బడ్జెట్ ప్రతిపాదనలపై పడనుంది.

Financial Support From Center
Financial Support From Center

కేంద్రం నుంచి ఆర్థిక సాయంలో రాష్ట్రానికి నిరాశే

No financial support to Telangana from Central Government: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో, రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా 9 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ నెలాఖరు వరకు పన్ను ఆదాయం 92 వేల 66 కోట్లు సర్కార్ ఖజానాకు జమ అయింది.

No additional grant to Telangana from Central Government : బడ్జెట్ అంచనా వేసిన లక్షా 26 వేల 606 కోట్లలో, డిసెంబరు నెలాఖరు వచ్చిన రాబడి 72.72 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వచ్చిన పన్ను ఆదాయం 74 వేల 496 కోట్లు రాగా, ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు వరకు 18,110 కోట్లు అదనంగా వచ్చింది. డిసెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 31 వేల 59 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా 10 వేల 713 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 22 వేల 169కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 13 వేల 188 కోట్లు వచ్చాయి.

State Finances: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 8 వేల 381 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 6 వేల 553 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయం ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ నెలలోనే అధికంగా సమకూరింది. ఇప్పటి వరకు నెలవారీ పన్ను ఆదాయం 10 వేల కోట్ల మార్కుపై ఉండగా, డిసెంబర్‌లో మాత్రం 11 వేల 213 కోట్ల మేర పన్ను ఆదాయం వచ్చింది. పన్నేతర ఆదాయం అంచనాల్లో 39 శాతం మేర అంటే 9 వేల 962 కోట్లు వచ్చింది.

కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లలో వచ్చింది చాలా తక్కువే. 41 వేల కోటి రూపాయల గ్రాంట్లు అంచనా వేయగా, అందులో కేవలం 19 శాతం మేర 7 వేల 770 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి ఆశించిన మేర గ్రాంట్లు రాకపోవడంతో, కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతోనే సర్దుకోవాల్సి వచ్చింది. రుణ పరిమితిలోనూ కోత విధించడంతో, ఆ ప్రభావం కూడా పడింది.

ఎఫ్​ఆర్​బీఎమ్​కు లోబడి 55 వేల కోట్ల రుణాలు ప్రతిపాదిస్తే, కేంద్రం అందులో దాదాపు 19 వేల కోట్ల మేర కోత విధించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలతోపాటు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు, నీతిఆయోగ్ సిఫారసు చేసిన గ్రాంట్లు భారీగా వస్తాయని ఆశించారు. ప్రత్యేక నిధులు, గ్రాంట్లు ఏ మాత్రం రాలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రానికి 7 వేల 700 కోట్లు మాత్రమే వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల్లో వాటా, గ్రాంట్లు, ప్రత్యేక నిధులు, రుణాల రూపంలో ఈ ఏడాది మొత్తం రూ. లక్షా 5 వేల 575 కోట్లు వస్తాయని అంచనా వేయగా, డిసెంబర్ నెలాఖరు వరకు అందులో కేవలం 45 వేల 159 కోట్లు మాత్రమే సమకూరాయి. చివరి త్రైమాసికంలో మరో 15 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధికి లోబడి 29 వేల 628 కోట్లు రుణంగా తీసుకొంది.

బడ్జెట్ అంచనాల్లో ఇది 57 శాతం వరకు ఉంది. మొత్తంగా అన్ని రకాలుగా డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ఖజానాకు లక్షా 39 వేల 428 కోట్లు సమకూరాయి. డిసెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం లక్షా 24 వేల 503 కోట్లు వ్యయం చేసింది. ఇందులో రెవెన్యూ వ్యయం లక్షా 12 వేల 11 కోట్లు కాగా, మూలధన వ్యయం 12 వేల 491 కోట్లు. వడ్డీల చెల్లింపుల కోసం 15 వేల 219 కోట్లు, జీతాల కోసం రూ. 26 వేల 955 కోట్లు ఖర్చు చేసింది.

పెన్షన్లపై 12 వేల 179 కోట్లు, రాయితీలపై 7 వేల 89 కోట్లు వ్యయం చేసింది. రంగాల వారీగా చూస్తే సామాన్య రంగంపై 37 వేల 241 కోట్లు, సామాజిక రంగంపై 43 వేల 26 కోట్లు, ఆర్థిక రంగంపై రూ. 44 వేల 235 కోట్లు ఖర్చు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.