ETV Bharat / state

ఆ నలుగురు పీఎఫ్​ఐ నిందితులను ప్రశ్నిస్తున్న ఎన్​ఐఏ

author img

By

Published : Mar 18, 2023, 3:50 PM IST

NIA officials have taken the four accused into custody in ppi case
నలుగురు నిందితులను కస్టడిలోకి తీసుకున్న ఎన్​ఐఏ

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణను ఎన్​ఐఏ అధికారులు వేగవంతం చేశారు. ఇవాళ చంచల్​గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. వారిని చంచల్​గూడ నుంచి మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు.

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ- ఎన్‌ఐఏ అధికారులు విచారణను వేగంవంతం చేశారు. ఇందులో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులు జహీద్, సమీ ఉద్దీన్‌, మాజ్‌ హుస్సేన్‌, ఖలీల్​లను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆనంతరం వారిని చంచల్‌గూడ నుంచి మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు.

పాపులర్ ప్రంట్ అఫ్ ఇండియా కేసులో ఇప్పటికే ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసిన దాఖలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ.. మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంతకు ముందు 11 మందిపై ఎన్‌ఐఏ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ప్రస్తుతం మరో ఐదుగురు నిందితులపై ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. అందులో పలు కీలక విషయాలను పేర్కొంది. భారత్​లో ముస్లిం యువతకు శిక్షణ ఇచ్చి వారిని 2047 వరకు ఇస్లాం దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఎన్​ఐఏ పేర్కొంది.

ప్రజల మధ్య మతకలహాలకై: ప్రజల మధ్య మత కలహాలను సృష్టిస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్​ సిక్స్ టౌన్ పోలీస్ స్టేషన్​లో గత సంవత్సరం జులై 4న వీరిపై కేసు నమోదైంది. అబ్దుల్ కాదర్, షేక్ సహదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరే కాక మరికొందరిని కూడా పోలీసులు నిందితులుగా పట్టుకున్నారు. మరో కేసు నమోదు చేసి గత సంవత్సరం ఆగస్టు 26న ఎన్‌ఐఏ దర్యాప్తును ప్రారంభించింది. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ, ఏపీలో ఎన్​ఐఏ సోదాలు చేసింది. అరెస్టు చేసిన నలుగురి ఇళ్లతో పాటు మరికొందరి అనుమానితుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణలో 34 ప్రాంతాల్లో, ఏపీలో 2 చోట్ల వీరు దర్యాప్తు చేశారు.

11 మందిపై అభియోగం: ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అబ్దుల్ ఖాదర్​తో సహా మరో 11 మందిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. నిందితులను కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపింది ఎన్‌ఐఏ. పోలీసులు నిందితుల నుంచి కొన్ని ముఖ్యమైన పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు, సీసీటీవీ రికార్డింగ్, మొబైల్​ ఫోన్లు, 2 కత్తులు, రూ.8.31 లక్షల నగదును వీరు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద వ్యాప్తి కోసం క్యాంపులు పెట్టి దానిలో శిక్షణ ఇవ్వడం, ప్రజల మధ్య మతకలహాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

దీనిపై కేసు దర్యాప్తు చేసింది. గత సంవత్సరం డిసెంబర్​లో పదకొండు మంది నిందితులపై అభియోగ పత్రాలను ఎన్​ఐఏ దాఖలు చేసింది. తాజాగా మరొక ఐదుగురు నిందితులపై అభియోగ పత్రాలను దాఖలు చేసింది. కీలకమైన ఆధారాలతో ఛార్జ్​షీట్ తయారు చేసిన కోర్టుకు సమర్పించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.