ETV Bharat / state

పవర్​ స్టార్​ బర్త్​డే సందర్భంగా... నెల్లూరు కుర్రాళ్ల గిఫ్ట్

author img

By

Published : Aug 31, 2020, 8:27 AM IST

ఆంధ్రప్రదేశ్​లో నెల్లూరు కుర్రాళ్లు మళ్లీ ఇరగదీశారు. సోషల్​ మీడియాతో మరోసారి మన ముందుకొచ్చారు. ఇప్పటికే తమ టాలెంట్​తో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను తమ వైపు చూసేలా చేసిన ... చిచ్చర పిడుగులు.. సోషల్ మీడియాను మరోసారి షేక్ చేయడానికి వచ్చారు. ఈసారి పవర్ స్టార్​ పవన్​ కల్యాణ్​కు బర్త్​డే గిఫ్ట్ ఇచ్చారు.

nellore-kurrallu-birthday-wishes-to-pawan-kalyan
పవర్​ స్టార్​ బర్త్​డే సందర్భంగా... నెల్లూరు కుర్రాళ్ల గిఫ్ట్

'సరిలేరు నీకెవ్వరు' స్పూఫ్​తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. మెగాస్టార్​​కు బర్త్​డే విషెస్ చెప్పి వావ్ అనిపించారు. ఇప్పుడు గబ్బర్​సింగ్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆ పిడుగులు.

పవర్​ స్టార్​ బర్త్​డే సందర్భంగా... నెల్లూరు కుర్రాళ్ల గిఫ్ట్

సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. గబ్బర్​సింగ్ స్పూఫ్​ చేసి.. మళ్లీ సోషల్​ మీడియాలో చెలరేగిపోయారు. ఆ సినిమాలో అందరినీ ఆకట్టుకున్న అంత్యక్షరి సీన్​ను సెల్​ఫోన్​లో చిత్రీకరించి.. పవర్ స్టార్​కు బర్త్​డే గిఫ్ట్ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఆధ్యాత్మిక ప్రదేశాలు తెరవాలంటూ సుప్రీంలో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.