ETV Bharat / state

వివేకానంద రెడ్డి హత్య కేసు.. కొత్తగా తెరపైకి వచ్చిన నవీన్ ఎవరు..?

author img

By

Published : Feb 1, 2023, 9:04 AM IST

Viveka Murder Case Updates: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతుండగా కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్నడూ కనిపించని, కనీసం పేర్లు వినిపించని వ్యక్తులు తెరమీదకి వస్తున్నారు. అలా వచ్చిన వారే నవీన్​ అనే వ్యక్తి. అసలు నవీన్​ ఎవరు.. అతడేం చేస్తారు.. తెలియాలంటే ఇది చదవాల్సిందే.

Vivekananda Reddy Murder Case Updates
Vivekananda Reddy Murder Case Updates

Viveka murder case News Today: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా తెరపైకి వచ్చిన నవీన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రత్యేకించి వైఎస్సార్​ జిల్లాలో అందరి నోటా అతని పేరే నానుతోంది. ఇంతకీ నవీన్​ ఎవరనే ప్రశ్న అందరిలో తలెత్తింది. ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా నవీన్ పేరు తెరపైకి వచ్చింది. ఇతన్ని సీబీఐ విచారించే అవకాశం ఉంది.

Vivekananda Reddy murder case Updates: నవీన్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో ఉంటున్నారు. గతంలో వీరు సీఎం జగన్ తాత రాజారెడ్డి దగ్గర పని చేస్తుండగా.. నవీన్ చదువుకుంటూ జగన్‌కు దగ్గర అయ్యారు. జగన్‌తో పాటు బెంగళూరు, హైదరాబాదులో లోటస్ పాండ్‌లో పని చేశారు. అనంతరం సీఎం తాడేపల్లికి మకాం మార్చినప్పుడు ఇక్కడికి చేరుకున్నారు.

దాదాపు 15 సంవత్సరాలుగా జగన్ కుటుంబానికి దగ్గరగా ఉంటున్నారు. జగన్ సతీమణి భారతికి విధేయుడుగా ఆమె పనులన్నీ చేసిపెడుతున్నట్లుగా సమాచారం. ఇంటికి వచ్చే అతిథులందరికీ సేవలందించడం.. లాంటి పనులన్నీ చేసిపెట్టేవారు. ఈ క్రమంలో కీలకంగా ఉన్న నవీన్‌కు.. వివేకా మరణానంతరం అవినాష్ రెడ్డి ఫోన్ చేసినట్లు కాల్ డేటా ఆధారంగా సీబీఐ గుర్తించింది. ఎక్కువ కాల్స్ అతని పేరిట ఉన్న నంబరుకు వెళ్ళడంతో అనుమానాలు పెరిగాయి.

తాడేపల్లిలో జగన్ నివాసంలో నవీన్ అన్ని రకాలుగా కీలక వ్యక్తి కావడంతో సీబీఐ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. హరిప్రసాద్‌గా పేరు పెట్టుకుని క్రమంగా నవీన్​గా మార్చుకున్నట్లు ఆయన పరిచయస్తులు చెబుతున్నారు. హరిప్రసాద్ పేరుతోనే సీబీఐ సోమవారం పులివెందులలో ఆరా తీసింది. ఇదిలా ఉండగా పులివెందులలో ఏదైనా కొత్తగా కారు కనిపిస్తే సీబీఐ అధికారులుగా భావించి హడావుడి కనిపిస్తోంది. అంతేకాకుండా అనుమానిత వ్యక్తులేవరూ పులివెందుల పరిసర ప్రాంతాలలో బయట కనిపించడం లేదు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.