ETV Bharat / state

ఆ కేసులో నందకుమార్​కు బెయిల్‌ మంజూరు.. అయినా జైల్లోనే ఉండక తప్పదు

author img

By

Published : Dec 3, 2022, 3:29 PM IST

nandakumar
నిందితుడు నందకుమార్​

Nampally court granted bail to Nandakumar: ఫిలింనగర్​లోని డెక్కన్​ కిచెన్​ పేరుతో మోసం చేశాడనే కేసులో నందకుమార్​కు బెయిల్​ మంజూరైంది. పూచికత్తుతో కూడిన బెయిల్​ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలూ జారీచేసింది. అయితే బెయిల్ వచ్చిన నందకుమార్ బయటకు వచ్చే అవకాశం లేదు. బంజారాహిల్స్ పీఎస్​లలో నమోదైన మిగతా కేసుల్లోనూ బెయిల్ వస్తేనే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

Nampally court granted bail to Nandakumar: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్​పై బంజారాహిల్స్ పీఎస్​లో నమోదైన ఓ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల పూచీకత్తుతో పాటు.. ఇద్దరు జామీను ఇవ్వాలని షరతు విధించింది. ఫిలింనగర్​లోని డెక్కన్ కిచెన్ పేరుతో దాదాపు 70లక్షల రూపాయలు మోసం చేశాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నందుకుమార్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అదే స్థలాన్ని మరికొంత మందికి లీజుకు ఇచ్చిన నందుకుమార్ డబ్బులు వసూలు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. నందుకుమార్ పై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. అయాజ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందుకుమార్​ను బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందుకుమార్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పీటీ వారెంట్ తీసుకొని జైలుకు తరలించారు.

ఈ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందిరా అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై పీటీ వారెంట్ ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నందుకుమార్​పై మొత్తం ఎన్ని కేసులు నమోదు చేశారో పూర్తి వివరాలు ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నందుకుమార్​కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పీఎస్​లలో నమోదైన మిగతా కేసుల్లోనూ కోర్టు నుంచి బెయిల్ వస్తే నందుకుమార్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.