ETV Bharat / state

'హైదరాబాద్​-విజయవాడ హైవే వెంబడి రైల్వే లైను కోరాం'

author img

By

Published : Sep 24, 2020, 4:15 PM IST

హైదరాబాద్​-విజయవాడ హైవే వెంబడి రైల్వే లైను వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్​ ఆర్థికంగా ఎంతో లాభదాయక ప్రాజెక్ట్​ అని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు, వాపపక్షాలు రేపు తలపెట్టిన నిరసనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

MP Uttam Kumar Reddy on Parliamentary Sessions
'హైదరాబాద్​-విజయవాడ హైవే వెంబడి రైల్వే లైను కోరాం'

పార్లమెంటు సమావేశాల్లో 2 అంశాలు లేవనెత్తినట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవే వెంబడి రైల్వే లైను వేయాలని.. సూపర్‌ ఫాస్ట్‌, బుల్లెట్ ట్రైన్ వేస్తే ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్​ ఆర్థికంగా ఎంతో లాభదాయక ప్రాజెక్ట్​ అని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పీఎస్‌యూలుగా మార్చొద్దని కోరినట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు. ఆ ఫ్యాక్టరీలకు నిధులిచ్చి ఆధునికీకరించాలని కోరామన్నారు. ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు కొనే వీల్లేకుండా బిల్లులో చేర్చాలన్నామని తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు, వామపక్షాలు రేపు తలపెట్టిన నిరసనకు పూర్తి మద్దతు ఉంటుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.

నెల రోజుల పాటు ఆందోళనలు..

మరోవైపు శ్రీశైలం నుంచి రోజుకు 6 టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు ఏపీ యత్నిస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. ఏపీకి సాయం చేస్తున్నారా అనేలా సీఎం కేసీఆర్ వైఖరి ఉందని విమర్శించారు. అక్రమ నీటి తరలింపుపై కేసీఆర్ మౌనం వహించారంటూ ధ్వజమెత్తారు. ఇందుకు నిరసనగా రేపటి నుంచి నెల రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించిందని స్పష్టం చేశారు.

హైదరాబాద్​కు మానిక్కం ఠాగూర్​

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మానిక్కం ఠాగూర్ ఈనెల 26న సాయంత్రం హైదరాబాద్​కు రానున్నట్లు ఉత్తమ్​ వివరించారు. దుబ్బాక ఉప ఎన్నిక సహా ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరితో చర్చించి ముందుకు వెళ్తామని తెలిపారు.

ఇదీచూడండి: రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.