ETV Bharat / state

'ఎవరి ప్రభుత్వం ఉంటే వారి దుకాణమే నడుస్తది'

author img

By

Published : Sep 23, 2020, 8:10 PM IST

ఎవరి ప్రభుత్వం ఉంటే వారి దుకాణమే నడుస్తుందని... ఎంతటివారైనా ఏదో ఒక రోజు ఓడాల్సిందేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థులు లేక కాంగ్రెస్‌ పార్టీ నేతలకే టిక్కెట్ ఇచ్చారన్న విషయం మర్చిపోవద్దని పేర్కొన్నారు.

'ఎవరి ప్రభుత్వం ఉంటే వారి దుకాణమే నడుస్తది'
'ఎవరి ప్రభుత్వం ఉంటే వారి దుకాణమే నడుస్తది'

అసెంబ్లీలో తాను చేసిన సూచనకు మంత్రి కేటీఆర్ స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాలని, అలా కుదరని పక్షంలో నామమాత్రపు రుసుం వసూలు చేయాలని తాను అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏడాది పాటు సమయం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వసూలు చేసే మొత్తాన్ని కొంత తగ్గిస్తే ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు.

నిలిపివేసిన రిజిస్ట్రేషన్లను తక్షణమే తిరిగి ప్రారంభించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులే దొరకరని మంత్రి శ్రీనివాసయాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇప్పుడున్న కార్పొరేటర్లలో 80 శాతం కాంగ్రెస్‌ పార్టీవారేనన్న ఆయన అధికారంలో ఎవరు ఉంటే.. ఆ పార్టీ మేయర్ జీహెచ్ఎంసీలో ఉంటారన్నారు.

లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు చూపిస్తానన్న తలసాని చూపెట్టలేకపోయారని, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థులు లేక కాంగ్రెస్‌ పార్టీ నేతలకే టిక్కెట్ ఇచ్చారన్న విషయం మర్చిపోవద్దని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'అధికార పార్టీకి అనుకూలంగా జీహెచ్​ఎంసీలో రిజర్వేషన్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.