ETV Bharat / state

Minister Talasani on Movie Tickets: 'సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు'

author img

By

Published : Dec 3, 2021, 4:21 PM IST

Updated : Dec 3, 2021, 6:03 PM IST

minister talasani srinivas yadav on movie tickets
మంత్రి తలసాని

16:19 December 03

సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే స్పష్టత: తలసాని

సినిమా టికెట్​ ధరలపై త్వరలోనే స్పష్టత: మంత్రి తలసాని

Minister Talasani on Movie Tickets: కొవిడ్​ మూడోదశ ముప్పుతో థియేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టబోతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజలు ధైర్యంగా థియేటర్​కు వెళ్లి సినిమా చూడొచ్చని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, సినిమా టికెట్​ ధరలు, థియేటర్ల ఆంక్షలపై సినీ దర్శక, నిర్మాతలు మంత్రి తలసానిని హైదరాబాద్​ మాసబ్​ ట్యాంక్​లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. సంక్రాంతికి భారీ బడ్జెట్‌ సినిమాల విడుదల నేపథ్యంలో... గంటపైగా మంత్రితో చర్చించారు. సమావేశంలో దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్​, నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యర్నేని నవీన్, ప్రమోద్, అభిషేక్ నామా పాల్గొన్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Minister Talasani press meet on Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై కూడా త్వరలోనే స్పష్టత వస్తుందని తలసాని అన్నారు. నిర్మాతలకు, ప్రేక్షకులకు మేలు జరిగే విధంగానే టికెట్ ధరలు ఉంటాయని.. త్వరలోనే హైకోర్టులో ఈ అంశానికి ముగింపు పలకబోతున్నట్లు తలసాని వివరించారు. మహమ్మారి వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. భారీ బడ్జెట్​ చిత్రాల విడుదల నేపథ్యంలో ప్రభుత్వం తమకు అండగా నిలవాలనే దర్శక, నిర్మాతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తలసాని.. థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని భరోసా ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయని.. ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తలసాని ధీమా వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ల ధరల సవరణ నిమిషాల్లో జరిగే పనికాదు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించాం. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండంగా ఉంటుంది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ వస్తోంది. అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలకు చెప్పా. -తలసాని శ్రీనివాస్​ యాదవ్​, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి

Minister Talasani on theatres closing: కొవిడ్ మూడో దశ ముప్పు వల్ల థియేటర్ల సామర్థ్యం 50 శాతం చేస్తారని ప్రచారం జరుగుతోందని సినీ నిర్మాత దిల్​ రాజు అన్నారు. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలున్నాయని.. సీఎం కేసీఆర్​ సూచన మేరకు పలు అంశాలను మంత్రి తలసానికి వివరించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Corona cases in telangana : విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్‌ నిర్ధరణ

Last Updated :Dec 3, 2021, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.