ETV Bharat / state

'కరోనా రెండో దశ వ్యాపిస్తోంది... అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Mar 29, 2021, 12:47 PM IST

Updated : Mar 29, 2021, 3:42 PM IST

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు టీకా తీసుకున్నారు. నేడు మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత టీకా తొలి డోసు తీసుకున్నారు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

mp santhosh taken covid vaccine, mlc kavitha taken covid vaccine
కొవిడ్ టీకా తీసుకున్న ఎంపీ సంతోష్, కొవిడ్ టీకా తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

minister niranjan reddy  taken covid vaccine, corona vaccination
కొవిడ్ టీకా తీసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత ఇవాళ వాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.

mp santhosh taken covid vaccine,  corona vaccination
కొవిడ్ టీకా తీసుకున్న ఎంపీ సంతోష్

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రెండో దశ వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.

mlc kavitha taken covid vaccine, corona vaccination
కొవిడ్ టీకా తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు కవిత చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు. వీరితో పాటు సంతోష్ సతీమణి కూడా టీకా తీసుకున్నారు.

ఇదీ చదవండి: శరద్ పవార్​కు స్వల్ప అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక

Last Updated : Mar 29, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.