ETV Bharat / state

మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడన్న మంత్రి కేటీఆర్‌

author img

By

Published : Aug 27, 2022, 3:03 PM IST

ktr speech at ambedkar open university hyderabad ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమై, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. 8 ఏళ్ల పాలనలో ఏం సాధించారని విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్​లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడన్న మంత్రి కేటీఆర్‌
మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడన్న మంత్రి కేటీఆర్‌

మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడన్న మంత్రి కేటీఆర్‌

ktr speech at ambedkar open university hyderabad: మతాల పేరుతో కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమై, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరల భారం మోపి పక్కదారి పట్టించేందుకు కులం, మతాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తిండి కోసం ఎంతో మంది అల్లాడుతున్నారని.. అలాంటి వారి గురించి ఆలోచించడం మానేసి అనవసర విషయాలపై ఎందుకు దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్​లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల కోసం స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ హయాంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగినన్ని నియామకాలు ఎక్కడా జరగలేదని తెలిపారు. ఎన్నో ప్రతిబంధకాలు అధిగమించి నియామకాలు చేపడుతున్నామన్నారు. 8 ఏళ్లలో 2.22 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్న ఆయన.. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. అందుకే ప్రైవేటు రంగ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు.

ఐఏఎస్​లకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాం..: ఈ క్రమంలోనే నీటి పారుదల రంగంలో తెలంగాణ ఉజ్వల స్థితికి చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. 8 ఏళ్ల పాలనలో ఏం సాధించారని విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. జల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందని.. సిరిసిల్ల జిల్లా ఐఏఎస్‌లకే జల సంరక్షణ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందని కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశచరిత్రలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ కూడా కేటాయించని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది ప్రస్తుత మోదీ ప్రభుత్వమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ హయాంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. రాష్ట్రంలో జరిగినన్ని నియామకాలు ఎక్కడా జరగలేదు. ఎన్నో ప్రతిబంధకాలు అధిగమించి నియామకాలు చేపడుతున్నాం. 8 ఏళ్లలో 2.22 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే ప్రైవేటు రంగ సంస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఒక్క విద్యా సంస్థను కేటాయించలేదు. రాష్ట్రానికి వచ్చి కొందరు మాపై విమర్శలు చేస్తుంటారు. ముందు వాళ్లు ఏమేమి ఇచ్చారో తెలుసుకుంటే బాగుంటుంది. - మంత్రి కేటీఆర్‌

ఇవీ చూడండి..

జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరంటూ కేటీఆర్​ పాప్​ క్విజ్​

పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం, 27 ఏళ్లు జైలు శిక్ష, రూ 171 కోట్లు ఫైన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.