ETV Bharat / state

KTR Review Meeting with High Officials : 'సహాయక చర్యలు సవాలుగా స్వీకరించి.. ముందుకు సాగాలి'

author img

By

Published : Jul 29, 2023, 3:27 PM IST

KTR Review Meeting with High Officials
KTR Review Meeting with High Officials

KTR Review Meeting with Officials : రాష్ట్రంలో వరద తగ్గుముఖం పట్టినందున మరమ్మతు చర్యలపై మంత్రి కేటీఆర్​ ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఊరిలో వరద ప్రభావం వల్ల దెబ్బతిన్న వాటిని తక్షణమే తాత్కాలికంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం తరుఫున ఎలాంటి సహాయక చర్యలైనా అందిస్తారని హామీ ఇచ్చారు.

Minister KTR Review Meeting with High Officials : రాష్ట్రంలో వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయని.. సహాయక చర్యలు, సమస్యలు లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని, కార్యక్రమాలపైన పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

KTR Giving Instructions to Employees in Telangana : ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన ప్రధానంగా టెలికాన్ఫరెన్స్​లో చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు వెళ్లాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయక సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సహాయ కార్యక్రమాల్లో ఇతర శాఖలతోనూ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు అందరికీ సెలవులను ఇప్పటికే రద్దు చేశామని తెలిపారు.

చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి : ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలన్నారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని.. అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించాలన్నారు. పట్టణాల్లో ముఖ్యంగా ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Telangana Floods 2023 : తెలంగాణపై వరద ప్రభావం.. 49 వంతెనలు ధ్వంసం.. విద్యుత్ సంస్థలకు రూ. 21 కోట్లు నష్టం

వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయాలి : పట్టణాల్లో ఉన్న రహదారులను వెంటనే మోటరబుల్​గా తయారు చేయాలని.. అవసరమయిన దగ్గర వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్​ని నిర్వహించి.. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల పిచికారి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పునరావస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తగిన ఏర్పాట్లు చేయాలని.. వారి ప్రాంతాల్లో వరద ముంపు పూర్తిగా తగ్గిపోతే.. వారి సొంత ప్రదేశాలకి తరలించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వరద ప్రవాహం వల్ల దెబ్బతిన్న వాటిని గుర్తించి.. యుద్ధ ప్రాతిపదికన తిరిగి ఏర్పాటు చేయాలని అధికారులకి డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.