ETV Bharat / state

ఓఆర్‌ఆర్‌పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్​ల ప్రారంభం

author img

By

Published : Oct 17, 2020, 1:05 PM IST

క్షతగాత్రులకు సత్వర చికిత్స కోసం ఓఆర్​ఆర్​పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్​లను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఓఆర్​ఆర్​కు 20 ఎగ్జిట్‌లు ఉండగా రెండింటికి ఒకటి చొప్పున మొత్తం 10 అంబులెన్సులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

minister ktr opened trauma centres at orr in hyderabad
ఓఆర్‌ఆర్‌పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్‌లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఓఆర్‌ఆర్‌పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్‌లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

బాహ్యవలయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు వీలుగా ట్రామా కేంద్రాలు, అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా వీటిని ప్రారంభించారు. ఓఆర్​ఆర్​కు 20 ఎగ్జిట్‌లు ఉండగా రెండింటికి ఒకటి చొప్పున ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

తక్షణ వైద్య చికిత్స అందేలా అవసరమైన అన్ని రకాల అత్యాధునిక ఉపకరణాలు ఈ అంబులెన్స్‌లలో ఉంటాయి. హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో అపోలో ఆస్పత్రి సౌజన్యంతో ఇవి పనిచేస్తాయని మంత్రి తెలిపారు. శంషాబాద్, టీఎస్​పీఏ, ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్, పటాన్‌చెరు, దుండిగల్, తుక్కుగూడ, బొంగులూరు, పెద్ద అంబర్ పేట్, ఘట్ కేసర్, శామీర్ పేట్​లలో వీటిని ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.