ETV Bharat / state

దశాబ్దాల పాటు పాలించి - విఫలమైన వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలా : మంత్రి కేటీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 6:20 AM IST

minister ktr interview
Minister KTR Meeting With Press Editors in Hyderabad

Minister KTR Meeting With Press Editors in Hyderabad : ఈ ఎన్నికల్లో మార్పు ఆర్నెళ్లకో మారు సీఎం మార్పు కోసమా? విద్యుత్​ కోతల కోసమా? స్కీంలు పోయి స్కాంల కోసమా అంటూ బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. నాటి నుంచి నేటి వరకు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి తెలంగాణ నమూనాగా ఎంచుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్​లో పత్రికా సంపాదకులతో మంత్రి కేటీఆర్​ సమావేశం నిర్వహించారు.

Minister KTR Meeting With Press Editors in Hyderabad : తొమ్మిదిన్నరేళ్లలో నికరంగా ఆరున్నరేళ్లు పని చేశాం.. శిథిలావస్థలో, విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని 2014 జూన్​లో మాకు అప్పగించారని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR)​ అన్నారు. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందోనని శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేసిందని తెలిపారు. కానీ ఇప్పుడు 75 ఏళ్ల భారతదేశంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. నాటి నుంచి నేటి వరకు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి తెలంగాణ నమూనాగా ఎంచుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్​లో పత్రికా సంపాదకులతో మంత్రి కేటీఆర్​ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముగ్గురు సీఎంలు చంద్రబాబు, వైఎస్సార్​, కేసీఆర్​ తమదైన ముద్ర వేశారని మంత్రి కేటీఆర్​ కొనియాడారు. రాష్ట్రంలో ఆల్​రౌండ్​ అభివృద్ధి జరిగిందని హర్షించారు. వినూత్న కార్యక్రమాలను(Telangana Schemes) ఎన్నో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని వివరించారు. ఇప్పుడు ఎన్నికలో ప్రభుత్వం మారాలని.. తప్పనిసరిగా మార్పు రావాలని కొందరు అంటున్నారని.. అయినా ఎందుకు మార్పునని కేటీఆర్​ ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీకి మాత్రమే నిరుద్యోగం - రాజకీయ ఉద్యోగం కోసమే ఆ పార్టీ ఆరాటం : మంత్రి కేటీఆర్

Telangana Assembly Elections 2023 : ఈ ఎన్నికల్లో మార్పు ఆర్నెళ్లకో మారు సీఎం మార్పు కోసమా? విద్యుత్​ కోతల కోసమా? స్కీంలు పోయి స్కాంల కోసమా అంటూ కేటీఆర్​ ప్రశ్నించారు. వ్యవసాయం దండుగ చేసి రైతులు ఆత్మహత్యల కోసమా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కావునే 2014లో బీఆర్​ఎస్​(టీఆర్​ఎస్​)కు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. గుజరాత్​లో ఐదు దఫాలు బీజేపీ.. 55 ఏళ్లుగా కాంగ్రెస్​ అధికారంలోకి కాంగ్రెస్​ లేదా అంటూ విమర్శలు చేశారు. దశాబ్దాలు పాలించి విఫలమైన వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. ఒక్కసారి జరిగిన తప్పునకే దశాబ్దాలుగా తెలంగాణ గోస పడిందని.. మళ్లీ ఆ తప్పు జరగవద్దన్నారు.

ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ కాంగ్రెస్​ గౌరవించలేదు : అభివృద్ధికి ఓటు వేయాలని కోరుతున్నామని.. కొంత అసంతృప్తి నిరుద్యోగుల్లో ఉన్న మాట వాస్తవమని మంత్రి కేటీఆర్​ అన్నారు. బీజేపీతో బీఆర్​ఎస్​ ఎప్పుడూ కలిసి పనిచేయదని.. కాంగ్రెస్​, బీజేపీలకు తాము సమదూరంలో ఉన్నామన్నారు. ఇప్పుడు ఎన్నికలు గెలిచాక మహారాష్ట్రపై దృష్టి సారిస్తామని అన్నారు. కాంగ్రెస్​ నేతలు నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు.. ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ గౌరవించని పార్టీ హామీలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. తాము వారిలా కాకుండా ఆర్థిక పరిస్థితులు, అన్నీ ఆలోచించుకొనే ఎన్నికల హామీలు ఇచ్చామని స్పష్టం చేశారు.

Minister KTR Fires on Congress : కాంగ్రెస్​ నేతలు ఏం చేయాలన్నా దిల్లీ అనుమతి కావాలి.. కామారెడ్డి, కొడంగల్​లో ఓడిపోయే రేవంత్​రెడ్డి సంతకం చేసిన గ్యారెంటీ కార్డును ఎవరు నమ్మరన్నారు. కేసీఆర్​ బ్రహ్మాండంగా ఉన్నారు.. ఆయనే తమ ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. మొదట తనకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు వద్దని అన్నానని.. కుటుంబ పాలన అంటారు.. మంత్రి పదవి వద్దన్నాని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయిన ఎమ్మెల్యేగా అయినా ఉంటానని కేటీఆర్​ తెలిపారు.

10 ఏళ్ల బీఆర్​ఎస్​, 50 ఏళ్ల కాంగ్రెస్​ - ఎవరి పాలన బాగుందో చూసి ఓటేయండి : సీఎం కేసీఆర్​

ఇల్లు కొనుగోలు చేసే మధ్య తరగతి ప్రజలకు త్వరలోనే గొప్ప శుభవార్త : మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.