ETV Bharat / state

'నాగోల్‌ మెట్రో.. దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం, హయత్ నగర్​ వరకు విస్తరణ'

author img

By

Published : Mar 25, 2023, 6:00 PM IST

Updated : Mar 25, 2023, 7:14 PM IST

హైదరాబాద్ వాసులకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వనస్థలిపురం నుంచి దిల్​సుఖ్ నగర్ మార్గంలోని ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా సిగ్నల్ ఫ్రీ ఫ్లైఓవర్ ఇప్పుడు వాహనదారులకు ఊరటనిస్తోంది.

Minister KTR inaugurated the LB Nagar flyover
ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వనస్థలిపురం నుంచి దిల్​సుఖ్ నగర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. వనస్థలిపురం నుంచి దిల్​సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ కష్టాలు తప్పించేందుకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్​ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

హైదరాబాద్‌లోని 'ఎల్బీనగర్‌- నాగోల్‌'కు మెట్రో అనుసంధానిస్తామని మంత్రి KTR స్పష్టం చేశారు. హయత్‌నగర్‌ వరకు విస్తరించడం సహా ఎయిర్‌పోర్టుకు అనుసంధానిస్తామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో చేపట్టిన 12 ప్రాజెక్టుల పనుల్లో... ఇప్పటికే 9 పూర్తి చేశామని మంత్రి KTR తెలిపారు. మిగతా మూడు ఫ్లై ఓవర్లను సెప్టెంబర్‌లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ చారి పేరును ఎల్బీనగర్ కూడలికి పెడతామని కేటీఆర్ ప్రకటించారు.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు.. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు నగరంలో అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాసింగ్ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా 47 పనులు ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ నిధులతో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనుల్లో మూడు పూర్తి కాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో ఉన్నాయి.

ఎల్బీనగర్ ఫ్లై ఓవర్​ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్​తో పాటు భూసేకరణ ఖర్చులతో కలుపుకొని మొత్తం రూ.32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఏపీ, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుండి వచ్చే ప్రజలతో పాటు నగర వాసులకు హయత్ నగర్ మీదుగా నగరంలో ఇతర ప్రాంతాలకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లేందుకు ఎంతగానో దోహద పడనుంది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ కూడలికి పెడతాము. త్వరలో దీనిపై ఆదేశాలు జారీ చేస్తాము. ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే 12 పనులు చేపట్టాము. వాటిని పూర్తి చేయడానికి రూ.658 కోట్లు ఖర్చు చేశాము. ఇప్పటికే ఎల్బీనగర్ ప్రాంతంలో 9ప్రాజెక్టులు పూర్తి చేశాము, మరో 3 ఫ్లైఓవర్ లను సెప్టెంబర్ లోగా పూర్తి చేసి వాటిని ప్రారంభిస్తాము. ప్రస్తుతం ఉన్న నాగోల్ మెట్రోను దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం చేస్తాము. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత మెట్రోను హయత్‌నగర్ వరకు విస్తరిస్తాము. ఎల్బీనగర్ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో కూడా అనుసంధానం చేస్తాము. అలాగే ఏడాదిన్నరలో కొత్తపేటలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తాము. జీవో 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లోని పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తున్నాము- కేటీఆర్, రాష్ట్ర మంత్రి

'నాగోల్‌ మెట్రో.. దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం, హయత్ నగర్​ వరకు విస్తరణ'

ఇవీ చదవండి:

Last Updated :Mar 25, 2023, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.