ETV Bharat / state

'పోటీలో తట్టుకోవాలంటే విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరం'

author img

By

Published : May 23, 2022, 7:03 PM IST

KTR In Davos World Economic Forum: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. చర్చలో డాక్టర్ రెడ్డీస్ చెందిన జీవీ. ప్రసాద్ రెడ్డి, పీడబ్లూసీకి చెందిన మహ్మమద్ అథర్​లు పాల్గొన్నారు

KTR
KTR

KTR In Davos World Economic Forum: కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ఊతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారతదేశంలో కొంత తక్కువ మద్దతు ఉందన్నారు. ప్రపంచ స్థాయి పోటీలో తట్టుకుని నిలబడాలంటే భారత లైసెన్స్ బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలకు అవసరమన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లైఫ్​సైన్స్ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందన్నారు.

లైఫ్​సైన్సెస్​పై చర్చ: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. చర్చలో డాక్టర్ రెడ్డీస్ చెందిన జీవీ. ప్రసాద్ రెడ్డి, పీడబ్లూసీకి చెందిన మహ్మమద్ అథర్​లు పాల్గొన్నారు. లైఫ్​సైన్సెస్ క్యాపిటల్​గా హైదరాబాద్ ఉందని.. దీనిని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్​ని హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని... భవిష్యత్తులో లైసెన్స్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

మనమే ముందున్నాం: హైదరాబాద్ లైఫ్​సైన్సెస్​లో ఇతర నగరాలకంటే ముందుందని.. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్​సైన్సెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ అతిపెద్ద రెండవ కార్యాలయాన్ని హైదరాబాద్​లో కలిగి ఉందని.. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలన్నారు. ఎందుకంటే ఈ రంగంలో ఇన్నోవేషన్​పై పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్​తో కూడుకున్నవని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలని సూచించారు. ఆ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.

లైఫ్​సైన్సెస్​ రంగం: కనీసం రానున్న దశాబ్ద కాలం పాటు భారత లైఫ్​సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఉన్న కేవలం మందుల తయారీపై మాత్రమే కాకుండా నూతన మాలిక్యుళ్లను తయారు చేసే దిశగా కృషి చేస్తే బాగుంటుందన్నారు. భారతదేశంలో నైపుణ్యానికి కొదవలేదని... ప్రభుత్వాలు లైఫ్​సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్​కి ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్​సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశధకులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తోందని వివరించారు.

ఇవీ చూడండి:

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు

Bride Death Case: పెళ్లి ఆపాలనుకుంది... కానీ ప్రాణమే పోయింది...

ఆమెను బలిగొన్న ఈ-బైక్.. ఛార్జింగ్​ పెడుతుంటే ఒక్కసారిగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.