ETV Bharat / state

పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా?: కేటీఆర్​

author img

By

Published : Nov 24, 2020, 5:16 PM IST

Updated : Nov 24, 2020, 6:08 PM IST

తెలంగాణ భవన్‌లో బీసీ సంఘాలతో మంత్రులు సమావేశమయ్యారు. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంఘాలు, కులాలు, వర్గాలపరంగా కొన్ని సమస్యలున్నాయని వెల్లడించారు.

minister ktr
పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా?: కేటీఆర్​

పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనుకుంటున్నారా?: కేటీఆర్​

సంఘాలు, కులాలు, వర్గాలపరంగా కొన్ని సమస్యలున్నాయని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. పేదలు ఏ కులం వారైనా న్యాయం చేయాలనేది సీఎం ఉద్దేశమని వెల్లడించారు. కులాలు, మతాలు, వర్గాలక తీతంగా అభివృద్ధి చేపడుతున్నామని వెల్లడించారు.

అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్షాలు విన్యాసాలు చేస్తున్నాయని ఆరోపించారు. మాటల కంటే ఎక్కువగా చేతల ద్వారా తెరాస అభివృద్ధి చేసి చూపిందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కూడా తెరాస మాత్రమే చేయగలదని వ్యాఖ్యానించారు.

బలహీనవర్గాల పట్ల తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. కులవృత్తుల పట్ల నిబద్ధతతో పనిచేసింది తెరాస ప్రభుత్వమేనని వివరించారు. రాష్ట్రంలో పశుసంపద, మత్స్య సంపద రెట్టింపు అయ్యిందని అభిప్రాయపడ్డారు. ప్రధాన సామాజిక వర్గాలకు న్యాయం చేసింది తెరాస ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చామన్నారు.

తెరాస ప్రభుత్వానికి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలనేది ప్రతిపక్షాల యత్నం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేశాం. - మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించామని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో 800కు పైగా రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.15 లక్షలు ఖర్చుపెడుతూ నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.

Last Updated : Nov 24, 2020, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.