ETV Bharat / state

కేటీఆర్​ పుట్టినరోజు సందర్బంగా నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : Jul 24, 2020, 3:30 PM IST

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్​ గోషామహల్​ నియోజకవర్గంలో పేదలకు నిత్యావసర సరుకులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కేక్​ కట్​ చేశారు.

minister ktr birth day celebrations in goshamahal
కేటీఆర్​ పుట్టినరోజు సందర్బంగా నిత్యావసరాల పంపిణీ

రాష్ట్ర మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలో పేదలకు నిత్యావసర సరుకులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గోషామహల్​ నియోజకవర్గ తెరాస సీనియర్​ నేత నందకిషోర్ బిలాల్​ నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ వెయ్యి మంది నిరుపేదలకు నిత్యావసరాలు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కేక్​ కట్​ చేసి కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.​

ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.