ETV Bharat / state

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఏర్పాటు: ఈటల

author img

By

Published : Oct 5, 2020, 7:05 PM IST

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే నిర్ణయంపై మంత్రి వర్గ ఉపసంఘంలో చర్చిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఏర్పాటు: ఈటల
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఏర్పాటు: ఈటల

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. దవాఖానాలో ఆరోగ్య శ్రీ సదుపాయం ఉంటే ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయమై లోతైన అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించుకుంటామని తెలిపారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు నివేదిస్తామన్నారు.

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఏర్పాటు: ఈటల

ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి ఈటల అన్నారు. దానికోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ఆ ఆలోచనను అమలు చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: బతుకమ్మ, దసరా ఇళ్ల వద్దనే చేసుకోవాలి: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.