ETV Bharat / state

ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: హరీశ్‌రావు

author img

By

Published : Mar 8, 2023, 7:57 PM IST

Harish Rao
Harish Rao

Harish Rao Review Meeting in Increase Influenza Cases: దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలోనూ స్వల్పంగా కేసులు పెరిగాయని వారు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హరీశ్​రావు.. ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Harish Rao Review Meeting in Increase Influenza Cases: దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యశాఖ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్​రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సహా పలు ఆస్పత్రుల సూపరింటెండెంట్​లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి మంత్రి హరీశ్​రావుకు అధికారులు వివరించారు. రాష్ట్రంలోనూ స్వల్పంగా కేసులు పెరిగాయని తెలిపారు. ఎక్కువగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఈ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే చిన్న పిల్లల ఓపీ పెరిగిందని.. ఇన్ పేషెంట్​లో ఎలాంటి పెరుగుదల లేదని వారు మంత్రి హరీశ్​రావుకి తెలియజేశారు.

ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి ఆందోళన వద్దు: ఇన్‌ఫ్లుయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్​రావు తెలిపారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడితే సరిపోతుందని వివరించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలని మంత్రి హరీశ్​రావు సూచించారు.

ఇన్‌ఫ్లుయెంజా ప్రధాన లక్షణాలు: జ్వరం, ఎడతెరపి లేని దగ్గు.. దీంతో పాటు వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి అన్న ఐసీఎంఆర్: ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్‌ కొన్ని జాగ్రత్తలను సూచించింది. తరచూ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. మాస్క్‌ ధరించాలని పేర్కొంది. రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని వివరించింది. నోరు, ముక్కును పదే పదే తాకకూడదని.. దగ్గుతున్నప్పుడు, ముక్కు కారుతున్నప్పుడు మీ ముక్కు, నోటిని కవర్‌ చేసుకోవాలని వెల్లడించింది. ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని.. అధిక మొత్తంలో ద్రవాలు తీసుకోవాలని చెప్పింది. జ్వరం, ఒళ్లునొప్పులు ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ మందులు వాడాలని వెల్లడించింది.

ఇవి చేయొద్దు: కరచాలనం చేయడం.. ఆలింగనం చేసుకోవడం వంటివి చేయొద్దని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదని.. ఇతరులు లేదా కుటుంబసభ్యులకు దగ్గరగా కూర్చుని ఆహార పదార్థాలను తినకూడదవి వివరించింది. సొంత చికిత్సలు వద్దని.. యాంటీబయాటిక్స్, ఇతర మందులను వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉపయోగించాలని సూచించింది.

ఇవీ చదవండి: 'ఆరోగ్య మహిళ' పథకానికి మంత్రి హరీశ్‌రావు శ్రీకారం

రాజకీయాల్లోకి 'కాంతార' హీరో! మొన్న మోదీతో.. నేడు సీఎం బొమ్మైతో మీటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.