ETV Bharat / state

పెండింగ్​ పనులను త్వరగా పూర్తి చేయండి : ఎర్రబెల్లి

author img

By

Published : Feb 20, 2021, 10:46 PM IST

రాష్ట్రంలో మిగిలిన రైతు వేదికలను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​లోని తన కార్యాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్​కుమార్​ సుల్తానియా, కమిషనర్​ రఘునందన్​ రావుతో సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు.

minister errabelli meeting panchayat raj officers developments works in villages in the state
పంచాయతీరాజ్​ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఉపాధిహామీ పథకానికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం దిల్లీ వెళ్లి రావాలని అధికారులను పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆదేశించారు. పెండింగ్​లో ఉన్న తొమ్మిది రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్​లోని తన కార్యాలయంలో పంచాయతీరాజ్​శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్​కుమార్​ సుల్తానియా, కమిషనర్​ రఘునందన్​రావు సంబంధిత అంశాలంపై మంత్రి సమావేశం నిర్వహించారు. కొత్తగా తీసుకురావాల్సిన నిధులు, పనుల కోసం తీవ్రంగా కృషి చేయాలని సూచించారు.

ఉపాధిహామీ అనుసంధాన పనులు కొనసాగాలని.. ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడాలని తెలిపారు. పల్లెల్లో పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, కల్లాల పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో పనులన్నీ పూర్తయ్యేలా అధికారులు క్షేత్ర పరిశీలన చేయాలని ఆదేశించారు. కోటి వృక్షార్చనలో నాటిన మొక్కలను సంరక్షించాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు ఆ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు.

ఇదీ చూడండి : అసలు దోషులకు శిక్ష పడే వరకు పోరాడతాం: న్యాయవాద జేఏసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.