ETV Bharat / state

బీ అలర్ట్​.. మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ

author img

By

Published : Mar 26, 2023, 4:36 PM IST

Updated : Mar 26, 2023, 4:52 PM IST

Telangana Weather Report: రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

rains in telangana
రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి

Telangana Weather Report: ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు తేలిక పాటి నుంచి గట్టి జల్లులు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ తరవాత రోజు నుంచి పొడి వాతావారణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. గాలి విచ్చిన్నతి ఈ రోజు విదర్భ నుంచి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపింది.

ఈ రోజు వాతావరణం: రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

రేపటి వాతావరణం: రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కొన్ని ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తరువాత రోజు నుంచి పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెబ్​సైట్​ imdhyderabad.imd.gov.in ద్వారా రాష్ట్ర ప్రజలకు సమాచారాన్ని వెల్లడించింది.

వాతావరణ శాఖ వాతావరణాన్ని అంచనా వేసి దానికి తగినట్టు వెదర్​ రిపోర్ట్​ను వారానికి ఒకసారి విడుదల చేస్తుంది. సాధారణ పరిస్థితులు ఉంటే సూచనలు జారీ చేయదు. ప్రమాదాలు జరిగేటట్టు ఏమైనా సంకేతాలు వస్తే ఆ సమస్య నుంచి బయటపడేందుకు తగిన జాగ్రత్తలు, హెచ్చరికలను ప్రజలకు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈ రోజు హైదరాబాద్​ వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. అందులో 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వాతావరణ పరిస్థితులను తెలియజేసింది. కొన్ని జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 26, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.