ETV Bharat / state

ED Raids In Medical Colleges : రూ.100 కోట్లకు పైగా కుంభకోణం.. ఈడీ అనుమానం

author img

By

Published : Jul 7, 2023, 4:32 PM IST

Medical Colleges ED Raids : డాక్టర్ కావాలని ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో అనుకుంటారు. సమయానుసారం కొంత మందికి అది బలంగా నాటుకుపోతోంది. అలాంటి విద్యార్థులనే ఆసరాగా చేసుకుంటున్నారు కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు. సీట్లను బ్లాక్​ చేసి.. రూ.కోట్లలో ఆ సీట్లను విక్రయిస్తున్నారు. దీనికి సంబంధించిన 12 మెడికల్​ కాలోజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీ యాజమాన్యాలకు నోటీసులివ్వనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ED Raids In Medical Colleges
ED Raids In Medical Colleges

Medical Colleges ED Raids: పీజీ మెడికల్ సీట్ల కుంభకోణంలో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. కొన్ని మెడికల్ కళాశాలలు పీజీసీట్లను విక్రయించి 100కోట్లకు పైగా సొమ్ముచేసుకున్నట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గత నెలలో ఈడీ అధికారులు 12 మెడికల్ కాలేజీలకు సంబంధించి 16 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి వైద్య కళాశాలలో నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు... బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ప్రీజ్ చేశారు.

ED Raids IN Medical colleges Case : ఆరోపణలు ఎదుర్కొంటున్న 12వైద్య కళాశాలలు పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి, ఆ తర్వాత వాటికి ఉన్న డిమాండ్ ను బట్టి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయా కళాశాలలకు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించినప్పుడు నగదు లావాదేవీలు బయటపడ్డాయి. ఈ డబ్బును కళాశాలల యాజమాన్యాలు సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు.

2016 నుంచి 2022 సంవత్సరం వరకు పీజీ మెడికల్ సీట్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేల్చారు. కాళోజీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ గతేడాది పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్య కళాశాలలకు చెందిన యాజమాన్యాలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. కళాశాలల బ్యాంకు ఖాతాలతో పాటు... యాజమాన్యాలకు చెందిన వ్యక్తిగత ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. మనీలాండరింగ్ జరిగినట్లు నిర్ధారణ చేసుకున్న తర్వాత తదనుగుణంగా ఈడీ అధికారులు చట్టప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నారు.

రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు... కొందరు మెరిట్​ విద్యార్థులు, దళారులతో కలిసి పీజీ సీట్ల బ్లాకింగ్​ దందాకు పాల్పడ్డాయనేది ప్రధాన ఆరోపణ. కొన్ని కళాశాలలు ముందుగానే కన్వీనర్​ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థి.. మరో కళాశాలలోను చివరి విడచ కౌన్సెలింగ్​ వరకు సీటు బ్లాక్ చేయడమే ఈ దందాలో కీలకం. అలా చివరి విడత వరకు ఆ సీటు బ్లార్​ అయి ఉండడంతో మిగిలిన విద్యార్థులు ఆ సీటు పొందే అవకాశం ఉండదు. అలా మిగిలిపోయిన సీట్లను కళాశాల నిర్వాహకులు సొంతంగా భర్తీ చేసుకోవచ్చు. దీనే ఛాన్స్​గా తీసుకుంటున్నారు. మిగిలిపోయిన సీట్లకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని సీట్లను విక్రయిస్తున్నారనేది కొన్ని ప్రైవైటు కళాశాలలపై కాళోదీ వర్సిటీ వర్గాలు ఆరోపించాయి.

గత సంవత్సరం 45సీట్లు పక్కదారి పట్టినట్టు వర్సిటీ వర్గాల అంతర్గత విచారణలో తెలిసింది. తమ సొంత రాష్ట్రాల్లో కన్వీనర్​ కోటాలో సీటు వచ్చే అవకాశమున్న విద్యార్థులూ తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లను బ్లాక్ చేసినట్లు వెల్లడైంది. అందురు ప్రవాస భారతీయ లేదా వైద్య సంస్థ కోటాను ఎంచుకోవడం గమనార్హం. దీంతో సీట్లను బ్లాక్​ చేసిన విద్యార్థల నుంచి కాళోజీ వర్సీటీ వివరణ కోరింది. ​అందులో ఏడుగురు విద్యార్థులు తాము అసలు దరఖాస్తే చేయలేదని వివరణ ఇవ్వడంతో వర్సిటీ వర్గాలు కంగుతిన్నాయి. పెద్దమొత్తంలో దందా జరిగిందని అనుమానించి వరంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.