ETV Bharat / state

Income tax Bomb call person Arrest : ఐటీ ఆఫీసులో డబ్బులుంటాయని కోటి డిమాండ్ చేశాడు.. ఎలాగంటే...

author img

By

Published : Jun 19, 2023, 10:11 PM IST

Etv Bharat
Etv Bharat

Man Arrest for Making Bomb Threat Call : ఇటీవలే రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖకు బాంబ్‌ ఉందని కాల్‌ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Income Tax Deportment Bomb Threating Person Arrest : ఓ వ్యక్తి ఇంటికి దూరంగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఇంకేముంది తన దగ్గర డబ్బులు లేక అప్పులు చేశాడు. అదే అలవాటుగా చేసుకున్నాడు. చివరికి అప్పులు ఇచ్చిన వారికి నగదు కట్టలేనంత స్థితికి వచ్చేశాడు. డబ్బు అవసరమని తెలిసింది. కష్టపడి సంపాదిస్తే ఎక్కువ సమయం పడుతుందని అనుకున్నాడేమో. తప్పుడు దారిని అన్వేషించాడు. చివరికి ఓ ఐడియా వచ్చింది. అది అమలు చెయ్యాలంటే డబ్బులు ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలని అనుకున్నాడు. చివరికి ప్రజలందరూ పన్నులు కడుతున్నారు కావున వారి దగ్గరే ఎక్కువ మొత్తంలో నగదు ఉంటుందని ఫిక్స్‌ అయ్యాడు. ఇంకేముంది తాను అనుకున్న పథకాన్ని అమలు చేశాడు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కి కాల్‌ చేసి బాంబ్‌ పెట్టాం.. అది పేలకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో భయపడిన అధికారులు బాంబ్‌ స్క్వాడ్‌ని పిలిపించారు. చివరికి అధికారులు అది ఫేక్‌ కాల్‌ అని తెలుసుకొని.. ఆ వ్యక్తిని పట్టుకుని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన జైని రాధాకృష్ణ అనే వ్యక్తి.. రంగారెడ్డిలోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పులు ఎక్కువగా చేశాడు. అన్ని శాఖల్లో కంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికంగా పన్నులు వసూలు చేస్తుందని భావించి.. వారిని నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టాలని ప్రణాళిక వేశాడు. ఈ క్రమంలోనే ఈనెల 11న హయత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి తన ఫోన్‌ ద్వారా డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ టవర్స్‌లో బాంబు పెట్టామని బెదిరించాడు. బాంబు పేలకుండా ఉండాలంటే తనకు రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

Person threatened Bank with fake bomb : డబ్బు కోసం బ్యాంక్‌లో‌ బాంబు బెదిరింపు.. అసలు విషయం తెలిసి అంతా షాక్​.!

ఫేక్‌ కాల్‌గా గుర్తించిన పోలీసులు : ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తమై.. బాంబ్‌ స్క్వాడ్‌ సాయంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. సదురు శాఖలోని ఉద్యోగులను కార్యాలయం నుంచి వెలుపలకి పంపి అణువణువునా గాలించారు. కార్యాలయంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఎవరో కావాలని చేసి ఉంటారని అధికారులు భావించారు. దీంతో విచారణ చేపట్టగా.. ఫేక్‌ కాల్‌గా తేల్చారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితుడు నివసించే ప్రదేశాన్ని పోలీసులు తెలుసుకున్నారు. ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తి తనే అని నిర్ధరించుకుని.. అరెస్టు చేశారు. రాధాకృష్ణని రిమాండ్‌కి తరలించామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.