ETV Bharat / state

Ayyanna Patrudu: 'ప్రతిపక్ష నేతలను శత్రువులుగా చూడటం సీఎం మానుకోవాలి'

author img

By

Published : Nov 4, 2022, 12:32 PM IST

Ayyanna Patrudu case: ఫోర్జరీ పత్రాల కేసులో అరెస్టై బెయిల్​పై విడుదలైన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెదేపా నేత అయ్యన్న పాత్రుడు సీఏం జగన్​పై ఘాటుగా విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను శత్రువులుగా చూడడం సీఎం మానుకోవాలని ఆయన హితవు పలికారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్న ఆయన.. ప్రభుత్వం ఎంత హింసించినా.. జగన్ అక్రమాలపై నిలదీస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

Ayyanna Patrudu
Ayyanna Patrudu

'ప్రతిపక్ష నేతలను శత్రువులుగా చూడటం సీఎం మానుకోవాలి'

Ayyanna Patrudu case: ఏపీలో న్యాయం ఇంకా ‌బతికే ఉందని మరోసారి నిరూపితమైందన్నారు ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు. ఫోర్జరీ కేసులో సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేయగా విశాఖ మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ తిరస్కరించడంతో అయ్యన్నపాత్రుడు విడుదలయ్యారు. విశాఖ నుంచి నర్సీపట్నం చేరుకున్నారు. మార్గమధ్యలో అడుగడుగునా ఆయనకు అభిమానులు హారతులతో స్వాగతం పలికారు.

ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే రాజకీయంగా చూడాలే తప్ప, కక్షసాధింపు చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. తనపై కోపంతో.. కుటుంబ సభ్యుల్ని వేధించడం తగదన్నారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి బలవంతంగా సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసినా.. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. అయ్యన్నకు బెయిల్ మంజూరు చేయడంతో నర్సీపట్నంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

కష్ట సమయంలో.. అండగా నిలిచిన అభిమానులకు, కార్యకర్తలకు అయ్యన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యన్నపాత్రుడికి ఫోన్‌ చేసిన చంద్రబాబు.. వైకాపా సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలపై అయ్యన్న పోరాటాన్ని ప్రశంసించారు. మున్ముందు ఇదే పంథా కొనసాగించాలని.. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.