ETV Bharat / state

KTR Tweet on BRS Candidates List : టికెట్​ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్

author img

By

Published : Aug 21, 2023, 5:56 PM IST

Updated : Aug 21, 2023, 7:03 PM IST

CM KCR Released BRS MLAs List KTR And Kavitha Tweet : 115 స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​కు.. మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత ట్విటర్​ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. టికెట్లు దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం కల్పిస్తామని కేటీఆర్​ తెలిపారు. మరోవైపు దమ్మున్న సీఎం-ధైర్యం గల ప్రకటన అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్​ చేశారు.

CM KCR Released BRS MLAs List KTR And Kavitha Tweet
CM KCR Released BRS MLAs List KTR And Kavitha Tweet

CM KCR Released BRS MLAs List KTR And Kavitha Tweet : వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగంగా ముందుగానే బీఆర్​ఎస్​ అభ్యర్థుల జాబితాను.. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ విడుదల చేశారు. 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులకు సీట్ల(BRS MLAs list 2023)ను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబురాల్లో మునిగిపోగా.. టికెట్లు దక్కని అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్సీ కవిత ఎక్స్​​(Twitter) వేదికగా తమ సందేశాన్ని తెలియజేశారు.

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్​.. ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరికీ అభినందనలను ట్విటర్​ వేదికగా తెలిపారు. సిరిసిల్ల నుంచి మరోసారి అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన కేసీఆర్​కు ధన్యవాదాలు చెప్పారు. కొంత మంది సమర్థ నాయకులకు అవకాశం కల్పించలేకపోయామని వివరించారు. ప్రజా జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎదురవుతాయని అన్నారు. టికెట్​ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామని ట్విటర్​ వేదికగా హామీ ఇచ్చారు.

"ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరికీ అభినందనలు. సిరిసిల్ల అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. కొంతమంది సమర్థనాయకులకు అవకాశం కల్పించలేకపోయాం. టికెట్‌ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తాం." - మంత్రి కేటీఆర్, ట్వీట్​​

  • I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections

    Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏

    Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,…

    — KTR (@KTRBRS) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Kavitha Kalvakuntla Tweet : మరోవైపు దమ్మున్న ముఖ్యమంత్రి-ధైర్యం గల ప్రకటన అంటూ ఎమ్మెల్సీ కవిత(MLC Kavita) ట్విటర్​ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 119 స్థానాలకు గానూ.. 115 మంది అభ్యర్థులను బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ధైర్యంగా ప్రకటించారని తెలిపారు. ఇది నిజంగా సీఎం కేసీఆర్​ సాహసోపేతమైన నాయకత్వం, ప్రభావంతమైన పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆమె కొనియాడారు. ఈసారి కూడా తెలంగాణ ప్రజలు బీఆర్​ఎస్​ను ఆశీర్వదించాలని కవిత ట్విటర్​ వేదికగా కోరారు.

"దమ్మున్న ముఖ్యమంత్రి - ధైర్యం గల ప్రకటన. తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయం. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ గారి ధైర్యవంతమైన నాయకత్వంపై, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకముంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని వినమ్రంగా కోరుతున్నాము !!" - ఎమ్మెల్సీ కవిత, ట్వీట్

  • Dumdaar Leader - Dhamakedaar Decision !!
    Our leader KCR Garu announced 115 exceptional candidates for the forthcoming Assembly elections out of 119 seats. It truly is a testament to the people's faith in CM KCR Garu's courageous leadership and the impactful governance of the… pic.twitter.com/G3czjqZeNK

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet On Mynampally Comments : మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao)పై మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్​ ట్విటర్​ వేదికగా ఖండించారు. హరీశ్​రావు బీఆర్​ఎస్​కు మూలస్తంభంలా కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారని వివరించారు. తామంతా హరీశ్​రావు వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

"మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తున్నా. మేమంతా హరీశ్‌రావు వెంట ఉంటాం. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు ఉన్నారు. హరీశ్‌రావు బీఆర్​ఎస్​ మూలస్తంభంగా కొనసాగుతారు." - మంత్రి కేటీఆర్, ట్వీట్​​

  • One of our MLAs who was denied a ticket to his family member in an outburst has made some derogatory comments on Minister Harish Rao Garu

    I not only strongly condemn the MLA’s behaviour and also want to make it clear that we all stand with @BRSHarish Garu

    He has been an…

    — KTR (@KTRBRS) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Jagadish Reddy Thanks To CM KCR : మరోసారి ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చిన సీఎం కేసీఆర్​కు మంత్రి జగదీశ్​ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు గెలిచి తీరుతామని సవాల్​ విసిరారు. ఉమ్మడి నల్గొండ బీఆర్​ఎస్​కు కంచుకోట అని మరోసారి స్పష్టం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సీట్లు సాధించిన అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో సంబురాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలో బీఆర్​ఎస్​ గెలుపు తధ్యం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!

CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ

Last Updated : Aug 21, 2023, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.