ETV Bharat / state

Minister KTR Fires on Modi Comments on Telangana : 'తెలంగాణపై పదే పదే అక్కసు ఎందుకు..' మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపాటు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 5:27 PM IST

Updated : Sep 18, 2023, 6:05 PM IST

Minister KTR Fires on Modi Comments on Telangana Formation : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు మూటలు ఎలాగూ ఇవ్వరు.. కనీసం మర్యాదైనా చూపండని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మోదీ పాలనలో ఒక్క విషయమైనా లేదని ఎద్దేవా చేశారు.

KTR Comments on PM Modi
KTR Sensational Comments on PM Modi

Minister KTR Fires on Modi Comments on Telangana Formation : తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మోదీ పాలనలో ఒక్క విషయమైనా లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. అక్కడ చెప్పేందుకు ఏమీ లేకనే పదే పదే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మూటలు ఎలాగూ ఇవ్వరు.. కనీసం మర్యాదైనా చూపండని ప్రత్యేక పార్లమెంటు సమావేశాల(Parliament Special Sessions) సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం(Modi Speech)పై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌(Twitter) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

"తెలంగాణ మీద.. ప్రధాని మోదీకి పదే పదే అక్కసు ఎందుకు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా ఎందుకీ వివక్ష? తెలంగాణ అంటేనే గిట్టనట్లు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? పదే పదే తల్లిని చంపి బిడ్డను తీశారని మోదీ అంటున్నారు. అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పేందుకు.. మీ పాలనలో ఒక్క విషయమైనా లేదు. అందుకే పదేపదే విషం చిమ్ముతున్నారని" ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

PM Modi On Telangana Formation in Parliament : 'తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది.. రక్తపుటేర్లు పారాయి'

Minister KTR Tweet on PM Modi : తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించటం ఇదే తొలిసారి కాదని.. చారిత్రక వాస్తవాల పట్ల మోదీ నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని కేటీఆర్‌ అన్నారు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదని చెప్పడం.. అవాస్తవమన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్‌ను విమర్శించే ప్రయత్నంలో తెలంగాణను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల త్యాగాలు, భావోద్వేగాలను మోదీ పరిగణించాలని హితబోధ చేశారు.

"వడ్లు కొనండని అడిగితే నూకలు బుక్కమని.. మా రైతులని కించపర్చింది మీ కేంద్రమంత్రి కాదా. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తదా.. మీలాగే మీ మంత్రులు. కోటి ఆశలు, ఆకాంక్షలతో పురుడుపోసుకున్న కొత్త రాష్ట్రానికి సహకరించకపోగా.. ఆది నుంచి కక్షను పెంచుకొని.. వివక్షనే చూపిస్తున్నారు కదా. ఏడు మండలాలు గుంజుకొని.. లోయర్‌ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని మర్చిపోం. నీతి ఆయోగ్‌ చెప్పినా నీతి లేకుండా మిషన్‌ కాకతీయ, భగీరథ నిధులు ఆపేశారు. కృష్ణా నీటి వాటాలు తేల్చకుండా పదేళ్లు దగా చేశారు. కాజీపేట ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయారు. దశాబ్దాల కలను నాశనం చేశారు. 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటీ ఇవ్వలేదు." -కేటీఆర్‌ ట్వీట్

  • మోదీ...తెలంగాణ విరోధి!

    తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు
    ఎందుకు ప్రధాని..?

    అమృతకాల సమావేశాలని పేరుపెట్టి
    విషం చిమ్మడం ఏం సంస్కారం ..?

    తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు
    మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..?

    తల్లిని చంపి బిడ్డను తీసారని
    అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు
    మా… https://t.co/3tNjBJSVOK

    — KTR (@KTRBRS) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MP Keshava Rao Speech in Parliament Special Sessions : ధనిక, పేద తారతమ్యాలపై సభలో చర్చించాలి: కె.కేశవరావు

KTR Tweet : పద్నాలుగు సంవత్సరాలు పోరాడి.. దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం అని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుకొని.. తమ ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారన్నారు. ఇలా బయ్యారం బొగ్గు గనులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సింగరేణి ప్రైవేటీకరణ వంటి విషయాలపై మంత్రి కేటీఆర్‌ ప్రధానిని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు రావు : ఈడీ, ఐటీ, సీబీఐలను ఎన్డీయే కూటమిలో చేర్చుకొని.. ప్రతిపక్షాలపై ఉసిగొల్పి ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న బీజేపీకి పొద్దున లేచి ప్రజాస్వామ్య సుద్దులు చెప్పడం విచిత్రమని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కానని కేటీఆర్ అన్నారు.

పార్లమెంటు సాక్షిగా ప్రధాని క్షమాపణలు చెప్పాలి : పార్లమెంట్ లో ఇచ్చిన విభజన హామీలకు పాతరేసి అబద్ధాల జాతర చేస్తామంటే సహించబోమని, భరించలేమని అన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని దగా చేసి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకు ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఆపాలని.. అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమన్న కేటీఆర్.. దేశం అంటే రాష్ట్రాల సమాహారం అని గుర్తు చేశారు.

KTR Fires on Congress 6 Guarantees : 'స్కాముల కాంగ్రెస్‌కు స్వాగతం చెబితే.. స్కీములన్నీ ఎత్తేస్తారు'

KTR on Bandi Sanjay speech in Lok Sabha : 'ఇప్పుడు బండి సంజయ్​ను మేమేం చేయాలంటారు..?'

Last Updated : Sep 18, 2023, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.