అద్భుత పనితీరుతో టీహబ్‌ దేశానికే ఆదర్శంగా మారింది: మంత్రి కేటీఆర్

author img

By

Published : Jan 13, 2023, 2:45 PM IST

Updated : Jan 13, 2023, 4:07 PM IST

KTR

KTR on Startups : భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదని తెలిపారు. హైదరాబాద్‌లో సుమారు 6,000 స్టార్టప్‌లు ఉన్నాయని వివరించారు. భారత్‌లో మొదటి ప్రైవేట్ రాకెట్ టీహబ్ నుంచే వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

అద్భుత పనితీరుతో టీహబ్‌ దేశానికే ఆదర్శంగా మారింది: మంత్రి కేటీఆర్

KTR on Startups : ప్రారంభించిన ఏడాదిలోనే అద్భుత పనితీరుతో టీహబ్‌ దేశానికే ఆదర్శంగా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొత్త అంకుర సంస్థలకు టీహబ్‌ చిరునామాగా మారిందని వివరించారు. హైదరాబాద్​లో సుమారు 6,000 స్టార్టప్‌లు ఉన్నాయని చెప్పారు. భారత్​లో పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టవచ్చని పేర్కొన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌తో టీహబ్ ఒప్పందం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

భారత్‌లో ఉద్యోగాలివ్వాలన్న ఆలోచన గొప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా డల్లాస్ వెంచర్​కి ఆయన అభినందనలు తెలిపారు. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. మంచి ఆలోచన ఉంటే అంకుర సంస్థకు పెట్టుబడులు ఇబ్బంది కాదని చెప్పారు. అయితే అంకుర సంస్థని ఎలా నిర్వహిస్తారు.. డబ్బు వృథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేస్తారు అనేదే ముఖ్యమని వివరించారు. అనేక రంగాల్లో చాలా స్టార్టప్​ ఇంక్యూబెటర్​లు ఉన్నాయని తెలిపారు. భారత్‌లో మొదటి ప్రైవేట్ రాకెట్ టీహబ్ నుంచే వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.

‘‘డల్లాస్‌ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్‌ నెలకొల్పింది. భారత్‌లో 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన గొప్పది. హైదరాబాద్‌లో సుమారు 6వేల స్టార్టప్‌లు ఉన్నాయి. భారత్‌ ఆర్థికంగా వృద్ధి చెందుతోంది. భారత్‌కు పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదు. అయితే, స్టార్టప్‌లను ఎలా నిర్వహిస్తారు? డబ్బు వృథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేస్తారనేదే ముఖ్యమైన అంశం. అనేక రంగాల్లో స్టార్టప్‌లు వస్తున్నాయి. భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్‌ టీహబ్‌ నుంచే వచ్చింది. ‘ధ్రువ స్పేస్’ సైతం హైదరాబాద్ నుంచి వచ్చి మొదటి ప్రయోగంలోనే నానో రాకెట్స్‌ని విజయవంతంగా నింగిలోకి పంపించింది’’ -కె. తారకరామారావు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి

ఇవీ చదవండి: రయ్​.. రయ్​.. 'వందే భారత్​'కు సర్వం సిద్ధం.. ఇక నుంచి ఆ ఆరు రోజులు బుల్లెట్​స్పీడ్​తో..

జనవరి 31న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. కొత్త భవన నిర్మాణ పనులు షురూ..

Last Updated :Jan 13, 2023, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.