ETV Bharat / state

KTR Instructions to BRS Leaders : 'మెట్రో విస్తరణ నియోజక వర్గాల్లో సంబరాలు నిర్వహించాలి'

author img

By

Published : Aug 1, 2023, 7:17 PM IST

KTR Talkig About Hyderabad Metro : జులై 31న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి తెలిసేలా బీఆర్​ఎస్​ నాయకులు కృషి చేయాలని మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రతి ఆర్టీసీ డిపో ముందు, మెట్రో విస్తరణ జరుగుతున్న నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరగాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Etv Bharat
Etv Bharat

KTR Instructions to BRS Leaders on TSRTC : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు కోరారు. బీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం కేసీఆర్​ పాలనలో మానవీయతకు నిదర్శనమన్నారు.

Celebrations In Front of All BUS Depos Telangana : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ముందర ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంఛార్జ్​లకు కేటీఆర్ సూచించారు. కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా అనాథలందరినీ ఒక పాలసీ కిందకు తీసుకురావడం చారిత్రాత్మక నిర్ణయమని కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సంతోషించతగ్గ విషయమని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రస్తుతం నెరవేరుతున్నందన సంబరాలు ప్రతి నియోజక వర్గంలో చేయాలని సూచించారు. రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను రూపొందించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు.

Telangana Flood 2023 CM review : "వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయండి"

Telangana State Government Release 500 Crores for Heavy Rains : మెట్రో విస్తరణ జరగనున్న నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు. మెట్రో విస్తరణ పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్​లో ట్రాఫిక్​ సమస్యలు తగ్గుతాయని అన్నారు. ప్రజలు మరింత సౌకర్యవంతమైన రవాణా లభిస్తుందని పేర్కొన్నారు. మెట్రోల్లో ప్రయాణం ప్రజలకు సమయంతో పాటు భద్రత కూడా ఉంటుందని వెల్లడించారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500 కోట్ల ఆసరాగా ఉంటుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. వరద వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయని.. మరికొన్ని చోట్ల విద్యుత్​ స్తంభాలు నేలకూలాయని గుర్తు చేశారు. వాటిని తక్షణమే పునరుద్ధరించాలని బీఆర్​ఎస్​ నాయకులకు ఆదేశించారు. వరద వల్ల నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని.. ప్రభుత్వం తరుఫున సౌకర్యాలను అందించాలని సూచించారు. మంత్రి మండలి ఏ ఏ నిర్ణయాలు తీసుకుందో తెలుకోవాలి అంటే ఇక్కడ క్లిక్​ చెయ్యండి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.