ETV Bharat / state

'గత ఏడాది దేశంలో వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో మూడోవంతు హైదరాబాద్​లోనే వచ్చాయి'

author img

By

Published : Dec 14, 2022, 2:02 PM IST

BOSCH New Office in Hyderabad: ఐటీలో తెలంగాణను ప్రథమస్థానంలో నిలిపేలా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాయదుర్గంలో బోష్ గ్లోబల్ సాప్ట్​వేర్ టెక్నాలజీస్ సెంటర్​ను ఆయన ప్రారంభించారు. దేశంలో అన్ని నగరాలకంటే ఎన్నో మెరుగైన వసతులు ఉన్నందునే గత ఏడాది ఐటీలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్​లోనే వచ్చాయని కేటీఆర్ తెలిపారు.

minister ktr
మంత్రి కేటీఆర్

BOSCH New Office in Hyderabad: తెలంగాణ అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తోందని... ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. సమర్థ నాయకత్వం, క్రీయశీల విధానాలు, పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పనతో అనేక అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతోందని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలో బోష్ స్మార్ట్ క్యాంపస్​ను కేటీఆర్ ప్రారంభించారు.

2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. గత ఏడాది దేశంలో వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో మూడోవంతు హైదరాబాద్​లో వచ్చాయని చెప్పడం చాలా సంతోశంగా ఉంది. త్వరలో మరిన్ని పెట్టుబడులు ఆకట్టుకునేందుకు వీలుగా తెలంగాణ మొబిలిటీ హబ్​ను ఏర్పాటుచేస్తున్నాం. - కేటీఆర్, ఐటీ మినిస్టర్

'గత ఏడాది దేశంలో వచ్చిన ఐటీ ఉద్యోగాల్లో మూడోవంతు హైదరాబాద్​లోనే వచ్చాయి'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.