ETV Bharat / state

KTR Chit Chat : సీఎం పదవిపై నాకు ఎటువంటి పిచ్చి ఆలోచనలు లేవు: కేటీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 8:16 PM IST

KTR Chit Chat : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి పిచ్చి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దిల్లీకి బానిసలని వ్యాఖ్యానించారు.

KTR Reaction on CM Post
Etv Chit Chat with Minister KTR

KTR Chit Chat : గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడో ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరుకోపం ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ఉన్న ధృడమైన విశ్వాసం ఉందని తెలిపారు. మీడియాతో ఇష్ఠాగోష్టిగా ఎన్నికలు, విపక్షాలపై మాట్లాడారు. బీఆర్ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందని.. బీ ఫారాల పంపిణీ కూడా పూర్తవుతుందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్‌(KTR).. ఫలితాల్లోనూ ముందే ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 40 చోట్ల అభ్యర్థులు లేరని.. బీజేపీ యుద్దానికి ముందే చేతులు ఎత్తేశారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులు ఈసారి 110 చోట్ల డిపాజిట్‌ కోల్పోతారని విమర్శించారు.

KTR Comments on BJP : కాంగ్రెస్ పదేళ్ల హయంలో ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు కేవలం 24 వేలు మాత్రమేనని కేటీఆర్‌ అన్నారు. అందులో తెలంగాణ వాటా పది వేలని వివరించారు. బీఆర్ఎస్‌ సర్కార్ హయాంలో 1.34 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని.. మిగిలిన 90 వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. వాళ్లు ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే.. మేము 13 వేలు ఇచ్చామని వెల్లడించారు.

30 వైద్య కళాశాలలు పెట్టిన బీఆర్‌ఎస్‌ ఎక్కడ.. మూడు కళాశాలలు పెట్టిన కాంగ్రెస్‌ ఎక్కడని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్, తాగునీరు, వైద్యం, సాగునీరు ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో.. తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Minister KTR Chit Chat : 'డబ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్‌లో టికెట్లు.. అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్​లో తన్నులాటే'

KTR Comments on Congress : కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం పోటీ కాదని.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం సరితూగరని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కోత వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒకే పంట పరిమితి మేరకు కొనుగోళ్లు చేస్తారని.. వాళ్లు తమకు సుద్దులు చెబుతారా? అని విమర్శించారు. ఖమ్మంలో కాంగ్రెస్‌(Congress)కు నేతలు నిండుగా ఉన్నా.. ఒక్క సీటు మాత్రమే వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు.

KTR Comments on Congress : బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించి 60 రోజులు అవుతుందని.. భీ ఫారాల పంపిణీ కూడా పూర్తవుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ముందున్నామని.. ఫలితాల్లో కూడా ముందు ఉంటామని తెలిపారు. గతంలో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలే గెలుస్తామని.. కాంగ్రెస్‌కు 40 నియోజకవర్గాల్లో అభ్యరులే లేరని ఎద్దేవా చేశారు. కులగణన కోసం బీఆర్‌ఎస్‌ భారాస ప్లీనరీలో, శాసనసభలో తీర్మానం చేశామని వెల్లడించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ(Rahul Gandi) ఆలస్యంగా మేల్కొన్నారని విమర్శించారు. మణికొండ, మక్తల్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

KTR Reaction on CM Post : తెలంగాణ విషయంలో నరేంద్ర మోదీ, రేవంత్‌ వ్యాఖ్యలు దారుణమని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దిల్లీకి బానిసలని వ్యాఖ్యానించారు. ముదిరాజ్‌లకు మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించామని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. రెండో వాదన లేదని అన్నారు. సీఎం పదవిపై తనకు ఎటువంటి పిచ్చి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.

KTR Fires on Congress : 'రాహుల్, రేవంత్​ లాంటి వాళ్లుంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో..?'

KTR Tweet on Farmers Suicides Telangana : రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు ప్రచారం చేస్తుందెవరో.. ఇప్పుడు చెప్పండి : మంత్రి కేటీఆర్

KTR Respond to Election Schedule : 'తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. బీఆర్‌ఎస్‌దే..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.