ETV Bharat / state

KRMB Three Member Committee Meeting : కృష్ణా జలాలు సాగుకు వద్దు.. తాగునీటి అవసరాలకే వినియోగించాలి: త్రిసభ్య కమిటీ

author img

By

Published : Aug 21, 2023, 4:58 PM IST

Krishna River Management Board
KRMB Three Member Committee Meeting

KRMB Three Member Committee Meeting : కృష్ణా నదిలో నీరు తక్కువగా ఉన్నందువల్ల.. సాగునీటి కోసం కాకుండా తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. హైదరాబాద్​లోని జలసౌధలో కేఆర్​ఎంబీ సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​ హాజరుకాలేదు.

KRMB Three Member Committee Meeting : కృష్ణాలో నీరు తక్కువగా ఉన్నందున సాగునీటి కోసం కాకుండా తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ(KRMB Three Member Committee) అభిప్రాయపడింది. హైదరాబాద్​లోని జలసౌధలో కేఆర్ఎంబీ(KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశానికి హాజరు కాలేదు. వేరే కార్యక్రమాలు ఉన్నందున త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని మురళీధర్ రెండు రోజుల క్రితం బోర్డుకు లేఖ రాశారు.

Krishna River Management Board Meeting At Jalasoudha In Hyderabad : ఈ సమావేశానికి హాజరైన ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తమ ప్రతిపాదనలను వివరించారు. ఏపీ అవసరాల కోసం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్‌ ఎడమకాల్వకు సంబంధించి 30 టీఎంసీ(TMC) నీళ్లు కావాలని అడిగారు. నీరు తక్కువగా ఉన్నందున ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా తాగునీటికి మాత్రమే వినియోగించుకోవాలన్న సభ్య కార్యదర్శి రాయిపురే.. ఛైర్మన్​ను సంప్రదించి నీటి విడుదల ఉత్తర్వులు ఇస్తామని అన్నారు.

ENC Muralidhar Letter To KRMB Chairman : గతేడాది ఆంధ్రప్రదేశ్​ ఎక్కువగా వినియోగించుకున్న జలాలను ఈ సంవత్సరానికి జమచేయాలని.. తదుపరి త్రిసభ్య కమిటీ సమావేశంలో వాటిని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు ఆగస్టు 11న తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్​ కేఆర్​ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు. 2022-23 ఏడాదిలో చెరి సగం నిష్పత్తిలో చూస్తే 205 టీఎంసీలను.. 34:66 నిష్పత్తిలో 51 టీఎంసీలు ఎక్కువగా వాడుకుందని లేఖలో పేర్కొన్నారు.

Distribution Of Krishna Water By Bachawat Committee : గతంలో బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో చిన్న నీటి వనరులను మినహాయించి మిగిలిన నీటిని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వినియోగించుకొంటున్నాయి. ఆ జలాలను వచ్చే నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు ఉండాలని రాష్ట్రం కోరింది. ఈ అంశంపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ విషయంలో నిర్ణయం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని కేఆర్​ఎంబీ ఛైర్మన్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు నీటి విడుదలపై ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. ఈ కమిటీలో బోర్డు సభ్యుడితో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు సభ్యులుగా ఉన్నారు.

KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ

KRMB Meeting Update : వర్చువల్​గా కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం.. హాజరుకాని తెలంగాణ ఈఎన్​సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.