ETV Bharat / state

Kanika Tekriwal JETSETGO: క్యాన్సర్​ను జయించి.. ఏవియేషన్​ రంగంలో రాణిగా 'కనికా'

author img

By

Published : Mar 8, 2022, 6:14 PM IST

Kanika Tekriwal JETSETGO: ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనుకుంటారు.. కానీ ఆ యువతి అందరికీ విమానసేవలు అందుబాటులోకి తీసుకురావాలనుకుంది. చిన్న వయసులోనే ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టి.. 'క్వీన్ ఆఫ్ ఇండియన్ స్కైస్‌'గా వెలుగొందుతోంది. పదహారేళ్లకే ఉద్యోగం, 22 ఏళ్లకే క్యాన్సర్‌పై విజయం, పాతికేళ్లు నిండకుండానే వ్యాపారం.. ఇలా ఎన్నో మైలురాళ్లు సాధించింది కనికా టేక్రివాల్‌. ఏవియేషన్ సర్వీస్‌ మార్కెట్‌లో 26 శాతానికి పైగా వాటాతో.. భారత ప్రైవేటు ఏవియేషన్‌ రంగాన్ని శాసిస్తున్న కనికా గురించి మరిన్ని విషయాలు...

kanika tekriwal
కనికా టెక్రివాల్​

Kanika Tekriwal JETSETGO: విమాన ప్రయాణం అంటే సంపన్నులదే అనుకునే స్థాయి నుంచి.. పెళ్లిళ్లకు ప్రత్యేకంగా ఫ్లైట్లు బుక్‌ చేసుకునే వరకు కాలం మారింది. డెస్టినేషన్ మ్యారేజేస్‌ అంటూ వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ప్రత్యేక విమానాల ద్వారా వెళ్తుంటారు. అలాంటి కార్యక్రమాల కోసం డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ అందించే సేవలు అనేకం ఉన్నా.. తమ కుటుంబం కోసమే ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్‌ చేయడం ప్రత్యేక అనుభూతి. అలాంటివారి కోసం ప్రైవేటు జెట్‌ సర్వీసులు అందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన కనికా టెక్రివాల్‌. ఆలోచనే పెట్టుబడి, ధైర్యమే ఆయుధంగా ముందుకెళ్తూ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

ఏవియేషన్‌ రంగంలో రాణిస్తున్న కనికా టెక్రివాల్‌

క్యాన్సర్​ను జయించి

Women's day special: ముంబయిలోని ఓ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన కనికకు.. చిన్నప్పటి నుంచి ఏవియేషన్‌ రంగంలో రాణించాలనే కల ఉండేది. అందుకనుగుణంగా చదివి 16 ఏళ్ల వయసులోనే ఏవియేషన్‌ రంగానికి సంబంధించిన ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరారు. కొన్నేళ్లపాటు పనిచేస్తూ ఆ రంగంలోని లోటుపాట్లు, వివిధ అంశాలపై అవగాహన పెంచుకున్నారు. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న సమయంలోనే... కనికాకు క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. పరిస్థితి విషమంగా ఉందని.. ఎక్కువకాలం బతకదంటూ వైద్యులు తేల్చారు. అలాంటి సమయంలోనూ జీవితం గురించి కలలు కంటూ.. తనకు తాను ధైర్యం చెప్పుకున్నారు. కష్టతరమైనా కీమో, రేడియేషన్‌ థెరపీలు చేయించుకున్న కనికా.. 22 ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌పై విజయం సాధించారు. తర్వాత ప్రైవేట్ ఏవియేషన్ రంగంలో వ్యాపారం చేయాలని భావించారు. కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారం అందకపోవటంతో.. ఐదువేల రూపాయలతో ఇంటి నుంచి బయటకొచ్చిన కనికా.. దిల్లీలోని స్నేహితుల సహాయంతో 2014లో జెట్‌సెట్‌ గో సర్వీసులు ప్రారంభించారు.

అంకురం నుంచి ప్రపంచ సంస్థగా... భారత్‌బయోటెక్‌ విజయంలో సుచిత్ర ఎల్ల పాత్ర

సొంతంగా 12 విమానాలు

ఇంటి నుంచి బయటకి వచ్చిన తొలినాళ్లలో ప్రైవేటు జెట్ ఓనర్లు, వినియోగదారుల మధ్య అనుసంధానం చేస్తూ... అవసరమైన వారికి ప్రైవేటు విమానాల సేవలు అందించేవారు. ప్రస్తుతం జెట్ సెట్ గో సంస్థకి సొంతంగా 12 విమానాలు ఉన్నాయి. 2020-21లో లక్ష మంది వీరి సేవలు వినియోగించుకోగా.. దాదాపు 6వేల విమాన సేవలు అందించారు. ప్రస్తుతం కనికా.. ఓలా, ఊబర్‌ తరహాలో.. సులభంగా ప్రైవేటు విమాన సేవలు అందిస్తున్నారు. భారత్‌లోనే అతిపెద్ద ప్రైవేటు ఏవియేషన్ సేవలు అందిస్తున్న కనికా.. క్వీన్ ఆఫ్ ఇండియన్ స్కైస్‌గా వెలుగొందారు. అంతేకాకుండా భారత ఏవియేషన్ మార్కెట్లో 26 శాతానికి పైగా వాటా సాధించారు.

Women Loco Pilots: మనోధైర్యమే బలం.. లోకో పైలట్లుగా రాణిస్తున్న అతివలు.!

అప్పటికీ ఇప్పటికీ ఒకేలా

కనికా చేసిన కృషికిగానూ ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30లో స్థానం సంపాదించడంతోపాటు.. యంగ్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా వంటి పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న కనికా.. వివాహానంతరం తన పనితీరులో ఎలాంటి మార్పులేదంటున్నారు. మహిళలు వివాహం తర్వాత కూడా వ్యాపారంలో రాణించవచ్చని చెబుతున్నారు.

ఇదీ చదవండి: Women's Day Special: వినియోగదారుల అభిరుచికే ప్రాధాన్యం.. అదే "విభా" విజయసూత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.